Liger Movie Final Collections | ‘డియర్ కామ్రేడ్’, ‘వరల్డ్ ఫేమస్’ వంటి వరుస బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల తర్వాత ‘లైగర్’తో విజయ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విడుదలకు ముందే ఈ చిత్రంపై విపరీతమైన బజ్ ఏర్పడింది. భారీ అంచనాల నడుమ ఆగస్టు 25న విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుండి ఫ్లాప్ టాక్‌ను తెచ్చుకుంది. ఓపెనింగ్స్ భారీ రేంజ్లో వచ్చిన రెండో రోజు నుండి ఫుల్ డ్రాప్స్ పడ్డాయి. కనీసం థియేటర్ రెంట్‌కు సరిపడ కలెక్షన్లు కూడా రాకపోవడంతో వారంలోపే థియేటర్లలో సినిమాను నుండి తీసేసారు. ఈ సినిమా ఫలితం మేకర్స్‌ను తీవ్రంగా నిరాశపరిచింది. ఇటీవలే పూరి డిస్ట్రిబ్యూటర్లకు కొంత వరకు మనీ రిటర్న్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రంతో పూరి జగన్నాధ్, ఛార్మీలకు భారీగా నష్టాలు వచ్చాయి. ఇక ఏరియా వైజ్ క్లోజింగ్ కలెక్షన్లు చూసుకుంటే:
ఏపీ+తెలంగాణ : 14.34 కోట్లు
హిందీ : 9.00 కోట్లు
కర్ణాటక : 1.5 కోట్లు
తమిళనాడు : 1.00 కోట్లు
కేరళ : 0.25 కోట్లు
ఓవర్సీస్ : 4.00 కోట్లు
ఈ చిత్రానికి వరల్డ్ వైడ్‌గా రూ.82.15 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.85 కోట్లు సాధించాల్సి ఉంటుంది. అయితే లైగర్ చిత్రం ఫైనల్‌గా రూ.30 కోట్ల వరకు షేర్‌ను కలెక్ట్ చేసింది. దీంతో ఈ చిత్రానికి రూ.55 కోట్ల వరకు నష్టాలు వచ్చాయి. అయితే హిందీలో మాత్రం ఈ చిత్రం ఎబో-యావరేజ్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని కరణ్‌జోహర్, ఛార్మీతో కలిసి పూరి స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. మార్షల్ ఆర్స్ట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్‌కు జోడీగా అనన్యపాండే హీరోయిన్గా నటించింది. ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ కీలకపాత్రలో నటించాడు.
Read Also:
God Father Movie | ‘గాడ్‌ఫాదర్’ మూవీ బిజినెస్ వాల్యూ అన్ని కోట్లా?
Naga Shaurya | ఆ స్టార్ హీరో భార్య.. నాగశౌర్యకు పెద్ద ఫ్యాన్ అని మీకు తెలుసా..!
NBK107 | భారీ ధరకు బాలకృష్ణ ‘NBK107’ నాన్-థియేట్రికల్ హక్కులు.. వామ్మో అన్ని కోట్లా?
Priyanka Arul Mohan | నాని హీరోయిన్‌కు బంపర్ ఆఫర్.. ఏకంగా స్టార్ హీరో సినిమాలో ఛాన్స్..!