జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) అంత్యక్రియలు ముగిశాయి. పోలీసులు గౌరవసూచకంగా గాల్లోకి కాల్పులు జరిపి కృష్ణ భౌతికకాయానికి వందనం చేశారు. కృష్ణకు కుమారుడు మహేశ్‌బాబు దహన సంస్కారాలు నిర్వహించాడు.
నటశేఖరుడిగా తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న కృష్ణకు అభిమానులు, కుటుంబసభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు అశ్రునయనాల మధ్య కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు.
అంతకుముందు పద్మాలయ స్టూడియోస్‌లో కృష్ణ పార్థీవదేహానికి అభిమానులు, ప్రజలు, సినీ ప్రముఖులు నివాళులర్పించిన అనంతరం.. మహాప్రస్థానం వరకు కృష్ణ అంతిమయాత్ర కొనసాగింది. సినీ పరిశ్రమకు చెందిన దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, సాంకేతి నిపుణులతోపాటు అభిమానులు భారీ ఎత్తున అంతిమయాత్రకు తరలివచ్చారు.
Read Also : Super Star Krishna | మహేశ్‌బాబును హత్తుకొని ఓదార్చిన కోటశ్రీనివాస రావు.. వీడియో
Read Also : Suprerstar Krishna | కృష్ణ చివరి సినిమా ఇదే.. ఒకే హీరోయిన్‌తో 43 సినిమాలు..
Read Also : Super Star Krishna | తెలుగులో స్పై జోనర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్.. సూపర్ స్టార్
Read Also : Super Star Krishna | పద్మాలయ స్టూడియోస్ నుంచి మొదలైన కృష్ణ అంతిమ యాత్ర