సూపర్‌స్టార్ కృష్ణ (Super Star Krishna) పార్థీవదేహానికి నివాళులర్పించేందుకు పద్మాలయ స్టూడియోకు అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రముఖ సీనియర్ నటులు కోటశ్రీనివాస రావు (KotaSrinivasaRao) వయోభారంతో ఇబ్బందిపడుతున్నప్పటికీ కృష్ణకు కడసారి వీడ్కోలు పలికేందుకు పద్మాలయ స్టూడియోకు వచ్చారు.
సహాయకుల సహకారంతో పార్థీవదేహంపై పూలు చల్లి .. కృష్ణకు నివాళులర్పించారు. అనంతరం మహేశ్‌బాబును హత్తుకొని ఓదార్చారు. నడిచేందుకు ఇబ్బంది పడుతున్నా.. సహనటుడికి తుది వీడ్కోలు పలికేందుకు వచ్చిన కోట శ్రీనివాసరావు వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రజల సందర్శనానంతరం పద్మాలయ స్టూడియో నుంచి మహాప్రస్థానం వరకు కృష్ణ అంతిమయాత్ర కొనసాగనుంది. ఇవాళ సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇప్పటికే అంత్యక్రియలకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాట్లు కూడా చేసింది.
మహేశ్‌బాబును ఓదారుస్తున్న కోట శ్రీనివాస రావు.. వీడియో
Veteran Actor #KotaSrinivasaRao pays homage to #SuperStarKrishna garu 💔#SSKLivesOn #RIPSuperStarKrishnaGaru pic.twitter.com/6U4PMKtIkc
— Mahesh Anna Fans (@MaheshBabu_star) November 16, 2022
Read Also : Suprerstar Krishna | కృష్ణ చివరి సినిమా ఇదే.. ఒకే హీరోయిన్‌తో 43 సినిమాలు..
Read Also : Super Star Krishna | తెలుగులో స్పై జోనర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్.. సూపర్ స్టార్
Read Also : Nidhhi Agerwal | ఇస్మార్ట్ బ్యూటీ ఫుల్ ఎంజాయ్ చేస్తున్న పాట ఇదేనట
Read Also : 80s actors | చిరంజీవి, రమ్యకృష్ణ, అర్జున్ డ్యాన్స్.. ట్రెండింగ్‌లో స్టిల్స్
Read Also : Gopichand30 | కోల్‌కతాలో సూపర్‌స్టార్ కృష్ణకు గోపీచంద్ 30 టీం నివాళి