ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి బ్రేక్ అందుకుంది నిధి అగర్వాల్ (Nidhhi Agerwal). ఈ హైదరాబాదీ ముద్దుగుమ్మ ప్రస్తుతం పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్లో వస్తున్న హరిహరవీరమల్లు చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నిధికి సంగీతం అంటే చాలా ఇష్టం. ప్రస్తుతం ఈ బ్యూటీ ఓ సాంగ్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తోందట.
ఇంతకీ ఆ పాట ఏంటనుకుంటున్నారా..? ఓ ఇంటర్వ్యూలో అదేంటో చెప్పింది నిధి అగర్వాల్. కొన్ని రోజులుగా నెట్టింటిని షేక్ చేస్తున్న వారసుడు చిత్రంలోని రంజితమే సాంగ్ (Ranjithame song). ఈ పాటతోపాటు అజిత్ సినిమాలోని అలుమా డోలుమా, విజయ్ నటించిన మాస్టర్ చిత్రంలోని వాథి పాట అంటే కూడా తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది.
నిధి అగర్వాల్ ప్రస్తుతం పవన్ కల్యాణ్ సినిమాపైనే భారీగా ఆశలు పెట్టుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్టయితే నిధి జాతీయ స్థాయిలో స్టార్ డమ్ తెచ్చుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. నిధి అగర్వాల్ మరోవైపు తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌తో కలిసి ఓ సినిమా చేస్తుండగా.. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
రంజితమే సాంగ్..
Read Also : Love Today | దిల్ రాజు టీం అప్డేట్.. లవ్ టుడే ట్రైలర్ లాంఛ్ కొత్త టైం ఫిక్స్
Read Also : 80s actors | చిరంజీవి, రమ్యకృష్ణ, అర్జున్ డ్యాన్స్.. ట్రెండింగ్‌లో స్టిల్స్
Read Also : Gopichand30 | కోల్‌కతాలో సూపర్‌స్టార్ కృష్ణకు గోపీచంద్ 30 టీం నివాళి