80s actors | చిరంజీవి, రమ్యకృష్ణ, అర్జున్ డ్యాన్స్.. ట్రెండింగ్‌లో స్టిల్స్
ముంబైలో ఇటీవలే నటీనటులందరూ పదకొండోసారి (11వ రీయూనియన్ ) గెట్ టు గెదర్ ఏర్పాటు చేసుకున్నారు. ఈవెంట్లో యాక్టర్లంతా సరదా సమయాన్ని ఆస్వాదించారు. ఇప్పటికే 80స్ యాక్టర్ల రీయూనియన్ గ్రూప్ ఫొటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఇటీవలే 80స్ తారలంతా (80s actors) ఒక్క చోట సందడి చేసిన విషయం తెలిసిందే. ముంబైలో నటీనటులందరూ పదకొండోసారి (11వ రీయూనియన్ ) గెట్ టు గెదర్ ఏర్పాటు చేసుకున్నారు. స్టార్ హీరోలు చిరంజీవి, వెంకటేశ్, అనిల్ కపూర్, అర్జున్‌తోపాటు నరేశ్, అనుపమ్ ఖేర్, జాకీ ష్రాఫ్, భానుచందర్, భాగ్యరాజ్, శరత్ కుమార్, శోభన, రాధ, రేవతి, ఊర్మిళ, సుహాసిని, సుమలత, రమ్యకృష్ణ, రాజ్‌కుమార్ సేతుపతి, ఖుష్బూ సుందర్, పూనమ్ ధిల్లాన్తోపాటు పలువురు నటీనటులు ఈవెంట్‌కు హాజరయ్యారు.
ఈవెంట్లో యాక్టర్లంతా సరదా సమయాన్ని ఆస్వాదించారు. ఇప్పటికే 80స్ యాక్టర్ల రీయూనియన్ గ్రూప్ ఫొటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ స్టార్ పార్టీకి సంబంధించిన స్టిల్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. చిరు, రమ్యకృష్ణ, అర్జున్, మధుబాల హుషారుగా డ్యాన్స్ చేస్తూ.. ఫుల్ ఎంజాయ్ చేస్తున్న ఫొటోను మధుబాల ట్విటర్లో పోస్ట్ చేసింది. ఈ ఫొటో ఇపుడు వైరల్ అవుతోంది. స్టార్ యాక్టర్ల రీయూనియన్ పార్టీ ఎలా జరిగిందో ఈ ఫొటోతో అర్థమవుతుంది.
రమ్యకృష్ణ, చిరంజీవి కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయని తెలిసిందే. చాలా కాలం తర్వాత ఈ ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తున్న స్టిల్ ను చూసి మూవీ లవర్స్ ఫిదా అవుతున్నారు.
80స్ యాక్టర్ల పార్టీ ఫొటోలపై ఓ లుక్కేయండి మరి..
— madhoo (@madhoo69) November 14, 2022
— madhoo (@madhoo69) November 14, 2022
Read Also : Nidhhi Agerwal | ఇస్మార్ట్ బ్యూటీ ఫుల్ ఎంజాయ్ చేస్తున్న పాట ఇదేనట
Read Also : 80s actors | చిరంజీవి, రమ్యకృష్ణ, అర్జున్ డ్యాన్స్.. ట్రెండింగ్‌లో స్టిల్స్
Read Also : Gopichand30 | కోల్‌కతాలో సూపర్‌స్టార్ కృష్ణకు గోపీచంద్ 30 టీం నివాళి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

