Madha Gaja Raja | తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్ బేస్ ఉన్న యాక్టర్లలో ఒకడు విశాల్ (Vishal). విశాల్ నటించిన సినిమాల్లో ఒకటి మదగజరాజ (Madha Gaja Raja). సుందర్ సీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ యాక్షన్ కామెడీ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కింది. 2013 పొంగళ్ కానుకగా జనవరిలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం పలు కారణాలతో వాయిదా పడుతూ.. 12 ఏండ్ల లాంగ్ గ్యాప్ తర్వాత నేడు థియేటర్లలోకి వచ్చేసింది.
సోషల్ మీడియాలో వస్తున్న ట్రెండ్స్ ప్రకారం ఈ చిత్రం మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రేక్షకులు థియేటర్లలో సినిమాను ఎంజాయ్ చేయడమే కాదు.. ఎక్స్‌లో పాజిటివ్ ట్వీట్స్‌తో సినిమాపై మరింత హైప్ వస్తోంది. దశాబ్ధం కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్‌పైకి వచ్చినప్పటికీ కామెడీ ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తున్నట్టు కోలీవుడ్ సర్కిల్ సమాచారం.
ఈ చిత్రంలో అంజలి, వరలక్ష్మి శరత్‌కుమార్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించగా.. సంతానం, సోనూసూద్ కీలక పాత్రల్లో నటించారు. జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ తెరకెక్కించిన ఈ మూవీకి మల్టీ టాలెంటెడ్ యాక్టర్ విజయ్ ఆంటోనీ సంగీతం అందించాడు. మరి దశాబ్ధం తర్వాత థియేటర్లలో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటూ విశాల్‌కు క్రేజీ ఎలా ఉందో చెప్పకనే చెబుతుంది.
Mazaka Teaser | రకుల్ బెటరా.. రెజీనా బెటరా అంటే ఏం చెప్తానండీ.. సందీప్ కిషన్ మజాకా టీజర్
Game Changer | గేమ్ ఛేంజర్ కలెక్షన్లు ఫేకా?.. రిపోర్ట్స్ ఏం అంటున్నాయి అంటే.!