Mazaka Teaser | తెలుగు, తమిళ ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని యాక్టర్ సందీప్ కిషన్ (Sundeep Kishan). ఈ టాలెంటెడ్ యాక్టర్ ప్రస్తుతం ధమాకా ఫేం త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రం మజాకా (Mazaka). ఇప్పటికే లాంచ్ చేసిన మజాకా టైటిల్, ఫస్ట్ లుక్‌లో సందీప్ కిషన్ పంచె కట్టులో కొత్తగా కనిపిస్తూ సందడి చేస్తున్నాడు.
తాజాగా మేకర్స్ టీజర్ లాంచ్ చేశారు. ఆర్కే బీచ్‌లో మందుకొడుతున్న ఇద్దరినీ స్టేషన్‌కు తీసుకొచ్చాం సార్.. హీరోహీరోయిన్లు స్టేషన్లో ఉన్న సీన్లతో మొదలైంది టీజర్. ఫన్ ఎలిమెంట్స్‌తో సాగనున్నట్టు టీజర్ (Mazaka Teaser) చెబుతోంది. అక్కడ పోసుకున్నది బీరు కాదండి.. నా ఉసురు అని సందీప్ కిషన్ అంటుంటే.. నాకు తెలియక అడుగుతున్నాను బీర్ బెటరా.. విస్కీ బెటరా అని అడుగుతోంది రీతూవర్మ. దీనికి రకుల్ బెటరా.. రెజీనా బెటరా అంటే ఏం చెప్తానండీ అంటున్నాడు.
ఈ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్గా నటిస్తుండగా.. రావు రమేశ్, మన్మథుడు ఫేం అన్షు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.మాస్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 21న విడుదల చేస్తున్నారు. ఈ మూవీని ఏకే ఎంటర్ టైన్ మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. మజాకా ఓటీటీ, శాటిలైట్ రైట్స్ రూ.23 కోట్లకు అమ్ముడుపోయినట్టు ఫిలిం నగర్ సర్కిల్ ఇన్సైడ్ టాక్.
మజాకా టీజర్..
Dhethadi Dhamaka, Chusko thadaka, Masth #Mazaka 🔥💥
The #MazakaTeaser is out now to make your Sankranthi celebrations extra special! ❤️🔥
Grand release in cinemas FEB 21st 🥳
🌟ing People’s Star @sundeepkishan, @riturv, #RaoRamesh @AnshuActress 🤩 pic.twitter.com/AivoCpe3rD
— BA Raju’s Team (@baraju_SuperHit) January 12, 2025
Game Changer | గేమ్ ఛేంజర్ కలెక్షన్లు ఫేకా?.. రిపోర్ట్స్ ఏం అంటున్నాయి అంటే.!
Daaku Maharaaj | డాకుమహారాజ్ సెట్స్‌లో బాలకృష్ణను హత్తుకొని ఏడ్చేసిన చిన్నారి