ఇటీవలి కాలంలో రీమేక్‌ల ట్రెండ్ బాగా పెరిగింది. ఒక భాషలో ఏదైన చిత్రం హిట్ అయింది అంటే ఆ సినిమా ఇతర భాషలలో వెంటనే రీమేక్ అవుతుంటుంది. ఈమధ్య మలయాళంలో విడుదలై మంచి విజయం సాధించిన దృశ్యం 2 తెలుగు, తమిళం, హిదీ భాషలలో రీమేక్ అవుతుంది. ఇక తాజాగా తమిళంలో తమిళ స్టార్ కమెడియన్ యోగిబాబు టైటిల్ రోల్లో నటించిన మండేలా సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. పొలిటికల్ సెటైర్‌తో పాటు కామెడీ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా రైట్స్ ఇప్పటికే ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ దక్కించుకోగా, రీమేక్ లో సునీల్ అయితే బాగుంటుందని నిర్మాతలు భావిస్తున్నారట.
యోగి బాబు పాత్రలో బండ్లగణేష్ నటించే అవకాశం ఉందని ఆ మధ్య ప్రచారం జరిగింది. ఇప్పుడు సునీల్ పేరు ఫ్రేంలోకి వచ్చింది. ఆయనతో నిర్మాతలు సంప్రదించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు టాక్. నాయి బ్రాహ్మణులకు సంబంధించిన కథాంశంతో రూపొందిన ఈ సినిమా ఈ మధ్యనే నెట్ ఫ్లిక్స్ లో విడుదలై సూపర్ హిట్ అందుకుంది. దర్శకుడిని ఫైనలైజ్ చేశాక మూవీపై అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉంది.