Divya Dristi | సునీల్, ఇషా చావ్లా కాంబోలో పూల రంగడు, మిస్టర్ పెళ్లి కొడుకు సినిమాలు వచ్చాయని తెలిసిందే. వీటిలో పూలరంగడు మంచి హిట్‌గా నిలువగా.. మిస్టర్ పెళ్లి కొడుకు ఆశించిన స్థాయిలో సక్సెస్ తెచ్చుకోలేకపోయింది. కాగా ఈ ఇద్దరు లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ ఓ ప్రాజెక్టులో కలిసి నటిస్తున్నారు.
సునీల్, ఇషాచావ్లా నటిస్తోన్న సినిమా దివ్య దృష్టి (Divya Dristi). సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో సాగే హార్రర్ థ్రిల్లర్‌గా ఉండబోతుందని టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ హింట్ ఇచ్చేస్తుంది. అయితే దివ్య దృష్టి థియాట్రికల్ రిలీజ్ కాకుండా డైరెక్టుగా ఓటీటీలో విడుదల కానుంది.
పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం సన్ నెక్ట్స్‌లో డిసెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సినిమాటోగ్రఫర్ కమ్ డైరెక్టర్ కబీర్ లాల్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. కమల్ కామరాజు కీలక పాత్రలో నటిస్తున్నాడు. త్వరలోనే ప్రమోషన్స్ మొదలు పెట్టనున్నారు మేకర్స్.
Feel the fear before you see it. Divya Dristi lands direct on Sun NXT this Dec 19!#DivyaDristi #SunNxtExclusive #DirectToSunNxt #SunNxt #ThrillerMovie #DivyaDristiOnSunNxt @EshaChawla63 #ActorSunil @kamalkamaraju @iam_kabirlal @LovelyWorldEnt2 @IamAjayKSingh pic.twitter.com/dVD4hpS9kU
— SUN NXT (@sunnxt) December 3, 2025
Ilayaraja | ఇళయరాజా పాటల వివాదం.. రూ.50 లక్షలతో మైత్రీ మూవీస్ సెటిల్మెంట్.!
Sobhita Dhulipala | మొదటి వివాహ వార్షికోత్సవం.. స్పెషల్ వీడియో షేర్ చేసిన అక్కినేని కోడలు
Thudarum | మలయాళ బ్లాక్‌బస్టర్ ‘తుడరుమ్’ రీమేక్‌లో అజయ్ దేవగణ్ ?