Spirit Movie | ప్రస్తుతం ప్రభాస్ ఉన్నంత బిజీగా ఇండియాలో ఏ యాక్టర్ లేడేమో. ఎప్పుడు ఏ షూట్లో ఉంటున్నాడో కూడా తెలియడం లేదు. ఇక ప్రభాస్ లైనప్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అరడజను ప్రాజెక్ట్‌లున్నాయి. అందులో ‘స్పిరిట్’ ఒకటి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాపై అభిమానులు, ప్రేక్షకులే కాదు సినీ సెలబ్రెటీల సైతం ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అర్జున్ రెడ్డి వంటి కల్ట్ సినిమా తెరకెక్కించిన సందీప్, ప్రభాస్‌తో ఏ రేంజ్ సినిమా తీస్తాడా అని విపరీతమైన ఆసక్తి నెలకొంది.
పైగా ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ పాత్ర పోషిస్తున్నాడు. తన సినీ కెరీర్లో ప్రభాస్ ఇప్పటివరకు ఖాకీ చొక్కా ధరించలేదు. ఇక ఇప్పుడు ప్రతిష్టాత్మక 25వ సినిమాలో పోలీస్ పాత్ర చేస్తుండటంతో ఎక్కడలేని అంచనాలే క్రియేట్ అయ్యాయి. రూత్‌లెస్ కాప్‌గా ఈ సినిమాలో ప్రభాస్ కనిపించనున్నాడట. ఏడాదిన్నర కిందటే అధికారిక ప్రకటన వచ్చిన ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి ఇంకో ఏడాది సమయం పట్టనుంది. ఓ వైపు ప్రభాస్ తన సినిమాలతో బిజీగా ఉండగా.. మరోవైపు సందీప్ ‘యానిమల్’తో బిజీగా ఉన్నాడు. ఇటీవలే ఈ సినిమా నిర్మాత భూషన్ కుమార్ ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివర్లో పట్టాలెక్కుతుందని వెల్లడించాడు.
ఇక ఇదిలా ఉంటే తాజాగా సందీప్‌రెడ్డి ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. యానిమల్ తర్వాత తీయబోయే సినిమా ఇదేనని, ఎక్స్పెక్టేషన్స్కు తగ్గకుండా సినిమా ఉంటుందని తెలిపాడు. అంతేకాకుండా ప్రభాస్ అన్న అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా.. ఆ ఎక్స్పెక్టేషన్స్కు మించి సినిమా ఉంటుందని వెల్లడించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
#Prabhas Anna Ante Expectations Ekkuva Untai Kadha – @imvangasandeep #Spirit #Prabhas25 pic.twitter.com/TPcQZsIxmr
— Prabhas Trends™ (@TrendsPrabhas) February 17, 2023
Read Also:
Shankar | ఇండియన్-2 సెట్లో శంకర్.. RC15కు మళ్లీ బ్రేక్
Vaarasudu Movie | వారసుడు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Vikram | రగ్గుడ్ లుక్‌లో చియాన్ విక్రమ్.. ఈ సారి గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చేలా ఉన్నాడు
Custody Movie | ఒక్క పాట కోసమే ఏడు సెట్‌లా.. నాగచైతన్య ఈ సారి భారీ ప్లాన్‌తో వస్తున్నాడుగా