Vaarasudu Movie Ott | తమిళ నటుడు విజయ్ ‘వారసుడు’ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. తెలుగు సంగతి పక్కనపెడితే తమిళంలో మాత్రం రికార్డులు సృష్టించింది. తొలిరోజే నెగెటీవ్ రివ్యూలు తెచ్చుకున్నా టాక్‌తో సంబంధంలేకుండా నిర్మాతలకు వసూళ్ల వర్షం కురిపించింది. నిజానికి ఈ సినిమా టాక్‌కు కలెక్షన్లకు సంబంధమే లేదు. ఒకానొక దశలో ఈ సినిమా మహా అయితే వారం ఆడుద్ది అనుకున్నారు. కానీ తమిళంలో ఇంకా ఈ సినిమా డీసెంట్ కలెక్షన్లను రాబడుతుంది. తెలుగులో మూడు రోజులు లేటుగా రిలీజైన ఈ సినిమా ఇక్కడ యావరేజ్ కలెక్షన్లతో సరిపెట్టుకుంది.
పైగా పోటీగా ‘వీరసింహా రెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ వంటి సినిమాలుండటంతో వారసుడును తెలుగు ప్రేక్షకులు పట్టించుకోలేదు. నిజానికి విజయ్‌కు తెలుగులో ఉన్న మార్కెట్ కంటే ఎక్కువే ఇక్కడ బిజినెస్ జరిగింది. దాంతో బ్రేక్ ఈవెన్ సాధ్యం కాలేదు. దానికి తోడు డివైడ్ టాక్ కూడా రావడంతో బోటా బోటి కలెక్షన్లతోనే సరిపెట్టుకున్నాడు. ఇక ఇప్పటివరకు ఈ సినిమా దాదాపు రూ.250 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఓవరాల్‌గా చూసుకుంటే దిల్‌రాజు మాత్రం సేఫ్ అయ్యాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది.
ఈ సినిమా హక్కులను అమెజాన్ సంస్థ దక్కించుకుంది. కాగా ఫిబ్రవరి 22 నుండి ఈ సినిమా ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇదే విషయాన్ని చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. విజయ్‌కు జోడీగా రష్మిక మందన్న నటించింది. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించాడు. నిజానికి ఈ సినిమా జనవరి 11నే తెలుగులో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల మూడు రోజులు వెనక్కి జరిగింది. అయితే ముందచ్చుంటే మాత్రం తెలుగు రిజల్ట్ వేరేలా ఉండేది.
Get ready to experience this captivating story laced with emotional turmoil!#VarisuOnPrime, Feb 22 only on @PrimeVideoIN in Tamil, Telugu and Malayalam.#Thalapathy @actorvijay sir @directorvamshi @iamRashmika @MusicThaman @7screenstudio @TSeries #Varisu #Vaarasudu #Vamshajan pic.twitter.com/Rry3P3KJYY
— Sri Venkateswara Creations (@SVC_official) February 17, 2023