Custody Movie | అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం ఫుల్‌ఫామ్‌లో ఉన్నాడు. ‘లవ్‌స్టోరీ’, ‘బంగార్రాజు’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో టైర్-2 హీరోల జాబితాలో టాప్ ప్లేస్‌లో నిలిచాడు. గతేడాది రిలీజైన థాంక్యూ డిజాస్టర్ ఫలితం మూటగట్టుకున్నా.. అది నాగచైతన్య కెరీర్‌పై పడలేదు. ప్రస్తుతం చైతన్య కస్టడీ అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. తమిళ దర్శకుడు వెంకట్‌ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్లు సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడీయోస్‌లో జరుగుతుంది. కాగా ఈ షెడ్యూల్లో ఓ పాటను చిత్రీకరిస్తున్నారట. అంతేకాకుండా ఈ ఒక్క పాట కోసమే దాదాపు 7సెట్లు వేసి భారీగా చిత్రీకరిస్తున్నారట. ముందు నుండి మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్లు ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ సినిమాతో నాగచైతన్యకు కమర్షియల్‌గా మంచి బ్రేక్ ఇస్తుందని చిత్రబృందం ధీమాగా ఉంది. చైతన్యకు జోడీగా కృతిశెట్టి నటిస్తుంది. ప్రతి నాయకుడి పాత్రలో అరవింద్ స్వామి నటిస్తున్నాడు. నటి ప్రియమణి కీలకపాత్ర పోషిస్తుంది. ఇక ఈ సినిమాను సమ్మర్ కానుకగా మే 12న రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.