Shankar Shanmugham | ఇండియాలోని ది బెస్ట్ డైరెక్టర్లలో శంకర్ ఒకడు. ఆయన నుంచి సినిమా వస్తుందంటే హీరో ఎవరా అని కూడా ఆలోచించకుండా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లిపోతుంటారు. సమాజంలోని లోపాల్ని వేలెత్తి చూపిస్తూనే కమర్షియల్ కోణంలో సినిమాలను తెరకెక్కించడం ఆయనకే చెల్లుతుంది. ఓ వైపు సోషల్ మెసేజ్ ఇస్తూనే మరోవైపు కావలిసినంత ఎంటర్టైన్మెంట్ అందిస్తాడు. అయితే గతకొంత కాలంగా శంకర్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోతున్నాయి. ప్రస్తుతం శంకర్ RC15తో పాటు ఇండియన్-2 సినిమాలను ఏకకాలంలో తెరకెక్కిస్తున్నాడు.
అయితే హీరోలు ఏకకాలంలో రెండు, మూడు సినిమాలు చేయడం సర్వసాధరణమే. కానీ దర్శకులు ఏకకాలంలో రెండు సినిమాలు చేయడం అనేది అరుదుగా వింటుంటాం. అది కూడా శంకర్ లాంటి ఒక విజనరీ డైరెక్టర్ రెండు భారీ ప్రాజెక్ట్‌లు చేయడం అంటే విశేషం అనే చెప్పాలి. ఇక ఇటీవలే ఆర్సీ15లో కీలక షెడ్యూల్ పూర్తి చేసుకున్న శంకర్.. ఇప్పుడు ఇండియన్-2 సెట్లోకి అడుగుపెట్టాడు. ఈ విషయాన్ని శంకర్ స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా భారతీయుడు సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతుంది. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్లు సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేశాయి. కాజల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ రెడ్ జియాంట్ బ్యానర్‌తో కలిసి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది.
Back on the sets of #Indian2 pic.twitter.com/B3ByCedXHc
— Shankar Shanmugham (@shankarshanmugh) February 16, 2023
Read Also:
RC15 Movie | చరణ్ డ్యాన్స్‌కు ఫిదా అయిన శంకర్.. జోష్‌లో మెగా అభిమానులు
Vaarasudu Movie | వారసుడు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Parushuram | తమిళ హీరోను లైన్లో పెట్టిన పరుశురామ్
Custody Movie | ఒక్క పాట కోసమే ఏడు సెట్‌లా.. నాగచైతన్య ఈ సారి భారీ ప్లాన్‌తో వస్తున్నాడుగా