Director Parushuram | ఒకప్పుడు తమిళ దర్శకులతో మనవాళ్లు సినిమాలు తెగ ఆరాట పడేవారు. శంకర్, మణిరత్నం వంటి దర్శకుల కోసం మన స్టార్లు పడిగాపులు కాసిన రోజులున్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ముఖ్యంగా కరోనా తర్వాత అన్ని ఇండస్ట్రీలతో పోల్చితే మన ఇండస్ట్రీ సక్సెస్ రేటు అధికంగా ఉంది. అంతేకాదు.. మన సినిమాలు పాన్ ఇండియా రేంజ్లో హిట్లు కొట్టడం. వసూళ్ల పరంగానూ రికార్డులు సాధించడంతో ఇప్పుడు తమిళ హీరోలు మన దర్శకులతో సినిమాలు తీయాలని ఇంట్రెస్ట్ చూపుతున్నారు.
ఇప్పటికే విజయ్.. వంశీపైడిపల్లితో ‘వారసుడు’ సినిమా చేసి తిరుగులేని విజయాన్ని సాధించాడు. రొటీన్ కథే అయినా.. వంశీ టేకింగ్ నచ్చి మరో సినిమా చాన్స్ ఇచ్చాడు. ఇక శివకార్తికేయన్.. అనుదీప్‌తో ‘ప్రిన్స్’ సినిమా తీసి పర్వాలేదనిపించుకునే హిట్ సాధించాడు. ధనుష్.. వెంకీ అట్లూరితో ‘సార్’ చేశాడు. శుక్రవారం రిలీజైన ఈ సినిమా పాజిటీవ్ రివ్యూలను తెచ్చుకుంది. ఇక శేఖర్ కమ్ములాతోనూ విజయ్ ఓ సినిమాను కమిట్ అయ్యాడు. కాగా తాజాగా మరో కోలీవుడ్ హీరో తెలుగు దర్శకుడితో చేతులు కలుపుతున్నట్లు తెలుస్తుంది.
పదేళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉంటున్నా రాని గుర్తింపు ‘గీతా గోవిందం’తో తెచ్చుకున్నాడు పరుశురామ్ పెట్ల. ఈ సినిమా విజయం ఏకంగా మహేష్‌తో ‘సర్కారు వారిపాట’ చేసే స్థాయికి తీసుకెళ్లింది. కానీ పరుశురామ్, మహేష్‌ను హ్యాండిల్ చేయలేకపోయాడు. బోటా బోటి మార్కులతోనే సరిపెట్టుకున్నాడు. దాంతో పరుశురామ్ తన నెక్స్ట్ సినిమాను లాక్ చేసుకోవడానికి చాలానే టైమ్ తీసుకున్నాడు. మధ్యలో నాగచైతన్యతో చర్చలు జరిపినా అది ఫలించలేదు. దాంతో తనను స్టార్ డైరెక్టర్‌గా చేసిన విజయ్‌తోనే తదుపరి సినిమాను ప్రకటించాడు. దిల్‌రాజు నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ దర్శకుడికి తమిళ హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. తమిళ వర్గాల సమాచారం ప్రకారం కార్తితో సినిమా ఓకే చేయించుకున్నట్లు సమాచారం. గతంలోనే వీళ్ల కాంబోపై వార్తలు రాగా.. ఇప్పుడు దాదాపు కన్ఫార్మ్ అయినట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం కార్తి చేతిలో రెండు ప్రాజెక్ట్‌లున్నాయి. అవి పూర్తయిన తర్వాతే కార్తి, పరుశురామ్ సినిమాను పట్టాలెక్కించనున్నాడు. ఈ లోపు పరుశురామ్ కూడా విజయ్‌తో సినిమాను పూర్తి చేయాలని భావిస్తున్నాడట.
Read Also:
Sir Movie Review | సార్ ఎలా ఉందంటే.. కాస్త రొటీన్ క్లాస్ తీసుకున్నారు మాస్టారు!
Meena | నటి సంఘవితో కలిసి మీనా అదిరిపోయే స్టెప్పులు.. వీడియో వైరల్
Custody Movie | ఒక్క పాట కోసమే ఏడు సెట్‌లా.. నాగచైతన్య ఈ సారి భారీ ప్లాన్‌తో వస్తున్నాడుగా
Pathaan Movie | బాలీవుడ్లో పఠాన్ బీభత్సం.. తొలి హిందీ సినిమాగా సరికొత్త రికార్డు