Meena | నటి సంఘవితో కలిసి మీనా అదిరిపోయే స్టెప్పులు.. వీడియో వైరల్
బాలనటిగా కెరీర్ ప్రారంభించిన మీనా ఆ తర్వాత 'నవయుగం' అనే తెలుగు సినిమాతో హీరోయిన్ గా మారింది. తొలి సినిమాకే ప్రేక్షకుల మనసు గెలుచుకున్న మీనా.. 'సీతారామయ్య మనవరాలు' సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత వరుసగా అగ్ర హీరోలతో జోడీ కట్టి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.
Actress Meena | బాలనటిగా కెరీర్ ప్రారంభించిన మీనా ఆ తర్వాత ‘నవయుగం’ అనే తెలుగు సినిమాతో హీరోయిన్ గా మారింది. తొలి సినిమాకే ప్రేక్షకుల మనసు గెలుచుకున్న మీనా.. ‘సీతారామయ్య మనవరాలు’ సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత వరుసగా అగ్ర హీరోలతో జోడీ కట్టి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోని స్టార్ హీరోలందరితో మీనా జోడీ కట్టింది. నటిగా మంచి ఫామ్ లో ఉన్నప్పుడు ప్రముఖ వ్యాపరవేత్త విద్యాసాగర్ ను వివాహం చేసుకుంది. వీరికి ఒక పాప. అంతా హ్యపీగా సాగుతుందనుకున్న సమయంలో గతేడాది మీనా భర్త విద్యాసాగర్ చనిపోయాడు. భర్త మరణంతో మీనా డిప్రెషన్ లోకి వెళ్లింది.
ఇప్పుడిప్పుడు ఆ చేదు సంఘటన నుంచి బయటకు వస్తుంది. ఇక ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ బిజీగా మారిపోయింది. ఇదిలా ఉంటే తాజాగా మీనా, సీనియర్ నటి సంఘవితో కలిసి ఓ పాటకు స్టెప్పులేసింది. దీనికి సంబంధించిన వీడియోను మీనా స్వయంగా తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. విశాల్ ‘ఎనిమి’ సినిమాలోని ‘టమ్ టమ్’ పాటకు వీరిద్ధరూ స్టెప్పులేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇక మీనా గతేడాది మోహన్ బాబు నటించిన ‘సన్ ఆఫ్ ఇండియా’లో ఓ కీలకపాత్ర పోషించింది. ఇక మళ్లీ ఇప్పటివరకు మరో తెలుగు సినిమాకు సైన్ చేయలేదు. ప్రస్తుతం మీనా తమిళంతో పాటు మలయాళంలో రెండు సినిమాలు కమిట్ అయింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

