RC15 Movie | చరణ్ డ్యాన్స్‌కు ఫిదా అయిన శంకర్.. జోష్‌లో మెగా అభిమానులు
మెగా వారసుడు రామ్‌చరణ్ క్రేజ్ ఇప్పుడు ఖండాంతరాలు దాటింది. ఆయన సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ బయటకు వచ్చినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ఆర్ఆర్ఆర్ తెచ్చిన గుర్తింపును నిలబెట్టుకోవడానికి చరణ్ గట్టిగానే కష్టపడతున్నాడు.
RC15 Movie | మెగా వారసుడు రామ్‌చరణ్ క్రేజ్ ఇప్పుడు ఖండాంతరాలు దాటింది. ఆయన సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ బయటకు వచ్చినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ఆర్ఆర్ఆర్ తెచ్చిన గుర్తింపును నిలబెట్టుకోవడానికి చరణ్ గట్టిగానే కష్టపడతున్నాడు. ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో RC15 చేస్తున్నాడు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇప్పటికే లీకైన చరణ్ లుక్స్ సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొల్పాయి. ఇదిలా ఉంటే తాజాగా రామ్‌చరణ్ తన స్కిల్స్‌తో శంకర్‌ను తెగ ఇంప్రెస్ చేశాడట.
ప్రస్తుతం చిత్రయూనిట్ ఈ మూవీకి సంబంధించిన ఓ పాట షూట్లో బిజీగా ఉంది. కాగా సాంగ్ షూట్లో భాగంగా చరణ్ ఓ 80సెకండ్ల నిడివిగల అతి కష్టమైన స్టెప్‌ను సింగిల్ టేక్‌లోనే చేసి అందరనీ ఆశ్చర్యపరిచాడట. అంతేకాదు తన డ్యాన్స్ స్కిల్స్‌ను చూసి శంకర్ సైతం ఇంప్రెస్ అయ్యాడట. సాధరణంగా శంకర్ ఏ ఆర్టిస్టు విషయంలోనూ అంత ఈజీగా ఇంప్రెస్ కాడు. అలాంటిది చరణ్ డ్యాన్స్‌కు ఫిదా అయ్యాడంటే మనోడు ప్రతిభ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయం తెలిసిన మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఇక చరణ్ డ్యాన్స్ గురించ ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇండియాలోని బెస్ట్ డ్యాన్సర్లలో చరణ్ ఒకడు. ఎంతో హార్డ్ స్టెప్స్‌ను కూడా సులభంగా చేసేస్తుంటాడు. ఇక నాటు నాటులోని డ్యాన్స్కైతే హాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్న ఈ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్‌కు నామినేట్ అయింది.
ఇక RC15 విషయానికొస్తే రామ్‌చరణ్ ఈ సినిమాలో తండ్రి, కొడుకులుగా కనిపించనున్నాడు. చరణ్‌కు జోడీగా కియారా అద్వాణీ, అంజలి నటిస్తున్నారు. శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

