SK30 | ‘ఊరిపేరు భైరవకోన’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు టాలీవుడ్ యాక్టర్ సందీప్ కిషన్ (Sundeep Kishan). ప్రస్తుతం ధమాకా ఫేం దర్శకుడు త్రినాథరావు దర్శకత్వంలో సందీప్‌కిషన్ 30 (SK30)వ సినిమాను చేస్తున్నాడని తెలిసిందే. నేడు ఈ మూవీ ప్రీ లుక్‌ను షేర్ చేశారు మేకర్స్. టేప్ రికార్డర్ భుజాన పెట్టుకున్న సందీప్‌కిషన్ తమ్ముళ్లూ రేపు సౌండ్ చేద్దామా.. ? అని అడుగుతున్నాడు.
ఈ మూవీ ఫస్ట్ లుక్ సెప్టెంబర్ 23 ఉదయం 10:14గంటలకు లాంచ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ ఇటీవలే హైదరాబాద్‌లో గ్రాండ్‌గా లాంచ్ అయిన విషయం తెలిసిందే. మాస్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రాన్ని రాజేశ్ దండా, ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్యమూవీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి ప్రసన్నకుమార్ బెజవాడ కథ, కథనం, మాటలు సమకూరుస్తున్నారు.
సందీప్ కిషన్ ఇప్పటికే ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ దర్శకుడు స్వరూప్ ఆర్ఎస్జే దర్శకత్వంలో ‘వైబ్’ అనే సినిమా చేస్తున్నాడు. త్రినాథరావు నక్కిన, ప్రసన్నకుమార్ బెజవాడ కాంబినేషన్లో ఇప్పటికే పలు సినిమాలు వచ్చాయి. మరోసారి ఈ క్రేజీ కాంబో వస్తుండటంతో అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి.
రెడీ ఐపోండి తమ్ముళ్ళూ…📢
రేపు సౌండ్ అదిరిపోద్ది 🔊💥Unveiling the #SK30 First Look Tomorrow, Sept 23rd, @ 10:14 AM 🔥
⭐ing @sundeepkishan
A @TrinadharaoNak1 Mass Entertainer 🤟@KumarBezwada @AnilSunkara1 @RajeshDanda_ @_balajigutta @lemonsprasad @leon_james @ajusatin… pic.twitter.com/8LjnsTaIuv— AK Entertainments (@AKentsOfficial) September 22, 2024
Chiranjeevi | గిన్నీస్ రికార్డ్.. Most Prolific Film Star అవార్డు అందుకున్న చిరంజీవి
Chiranjeevi | డ్యాన్సుల్లో చిరంజీవి అరుదైన ఫీట్.. తొలి యాక్టర్‌గా గిన్నీస్ రికార్డ్
Adivi Sesh | 2025లో మూడు సినిమాలట.. క్యూరియాసిటీ పెంచేస్తున్న అడివిశేష్
RT75 | ఆర్టీ 75 క్రేజీ న్యూస్.. రవితేజ ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్మెంట్ అప్పుడే..!