Thalaivar 173 | తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్, సుందర్ సీ కాంబోలో వచ్చిన అరుణాచలం ఏ స్థాయిలో బాక్సాఫీస్‌ను షేక్ చేసిందో తెలిసిందే. ఈ ఇద్దరూ Thalaivar 173 సినిమాతో ఆ మ్యాజిక్ రీక్రియేట్ చేయబోతున్నారని క్రేజీ వార్త కూడా బయటకు వచ్చింది. మూవీ లవర్స్‌తోపాటు అభిమానులు సిల్వర్ స్క్రీన్‌పై ఈ క్రేజీ కాంబోను ఊహించుకుంటూ పండగ చేసుకుంటున్నారు. అయితే ఇంతలోనే అభిమానులకు నిరాశ కలిగించే వార్తను షేర్ చేశాడు డైరెక్టర్ సుందర్ సీ. తాను తలైవా 173 మూవీని చేయడం లేదని అందరికీ ఊహించని షాక్ ఇచ్చాడు. ఈ మేరకు సుందర్ సీ ఓ స్టేట్మెంట్ కూడా విడుదల చేశాడు.
మీతో ముఖ్యమైన వార్తను షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఊహించని, అనివార్య కారణాల వల్ల లెజెండరీ స్టార్ కమల్ హాసన్ తెరకెక్కించాల్సిన తలైవా 173 ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నానన్నాడు సుందర్ సీ. అయితే సుందర్ సీ ఎందుకు ఈ సినిమా నుంచి తప్పుకున్నాడనే కారణాన్ని పేర్కొనలేదు. కానీ రజనీకాంత్ కమల్‌లతో తనకున్న గత అనుబంధాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటానన్నాడు. మా కాంబినేషన్లో వస్తోన్న ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రతీ ఒక్కరికీ క్షమాపణలు చెబుతున్నా అంటూ సుదీర్ఘ సందేశాన్ని పోస్ట్ చేశాడు సుందర్ సీ. ఇప్పుడీ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
మరి తలైవా 173ని ఎవరు డైరెక్ట్ చేస్తారోనని చర్చ తెరపైకి రాగా.. కార్తీక్ సుబ్బరాజు అయితే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రజినీకాంత్ ప్రస్తుతం జైలర్ 2తో బిజీగా ఉండగా.. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. మరోవైపు కమల్‌హాసన్‌తో కలిసి మల్టీ స్టారర్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కమల్ హాసన్ నిర్మించనున్న ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించబోతున్నాడంటూ వార్తలు వస్తుండగా తలైవా టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
Huge Breaking! #SundarC steps back from directing #Thalaivar173! 👇 pic.twitter.com/WnCPSBZVBJ
— Sreedhar Pillai (@sri50) November 13, 2025
Ram Gopal Varma | చాలా కాలం తర్వాత నిజమైన రాంచరణ్‌ను చూశా.. చికిరి చికిరి సాంగ్‌పై రాంగోపాల్ వర్మ