Sunaina Yella | తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని నటి సునయన యెల్ల. తెలుగులో కుమారి వర్సెస్ కుమారి సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చింది. రాజ రాజ చోర సినిమాతో తెలుగులో మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ 2025లో కుబేర సినిమాలో మెరిసింది. అయితే వ్యక్తిగత జీవితంలో కొత్త చాప్టర్‌ను మొదలుపెట్టబోతుందన్న వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ బ్యూటీ పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అవుతుందట.
ఇంతకీ ఈ బ్యూటీని చేసుకోబోయే వ్యక్తి ఎవరో తెలుసా..? పాపులర్ అరబ్ యూట్యూబర్ (కంటెంట్ క్రియేటర్) ఖలీద్ అల్ అమేరి.. అవును సోషల్ మీడియా ద్వారా ఇదే విషయంపై ఓ హింట్ ఇచ్చాడు ఖలీద్. సోషల్ మీడియాలో ఉన్న వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ కంటెంట్ క్రియేటర్స్‌లో ఒకడు ఖలీద్. ఇతడికి యూట్యూబ్‌లో 5.82 మిలియన్ల సబ్ స్క్రైబర్లు ఉండటమే కాదు.. ఇన్‌స్టాగ్రామ్‌లో 3.2 మిలియన్ల ఫాలోవర్లున్నారు.
ఖలీద్ ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో తన బర్త్ డే పార్టీకి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ఇందులో ఒక ఫొటోలో ఖలీదు సునయనతో ఉండటం చూడొచ్చు. అందమైన పుట్టినరోజు జరిపినందుకు ధన్యవాదాలు.. అంటూ క్యాప్షన్ ఇచ్చాడు ఖలీదు. ఇక ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు, ఫాలోవర్లు ఈ ఇద్దరి రిలేషన్షిప్ నిజమేనని.. త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారని అంచనా వేస్తున్నారు. మరి ఈ విషయాన్ని సునయన కానీ, ఖలీద్ కానీ అధికారికంగా ప్రకటిస్తారేమో చూడాలి. నాగ్‌పూర్‌లోని తెలుగు కుటుంబంలో జన్మించిన సునయన యెల్ల తమిళంలో మంచి ఫేం సంపాదించింది. కుబేరలో నాగార్జున భార్యగా నటించింది.
సునయన 2024లో ఓ వ్యక్తి చేయి పట్టుకొని కనిపించడంతో.. ఖలీద్‌తో డేటింగ్లో ఉందంటూ పుకార్లు తెరపైకి వచ్చాయి. ఆ తర్వాత ఖలీద్ తన ప్రియురాలి చేతిలో చేయి వేసి ఉన్న స్టిల్‌లో ఎంగేజ్మెంట్ రింగ్స్ కనిపించాయి. దీనిని సునయన లైక్ చేయడంతో డేటింగ్ రూమర్లు మరింత ఊపందుకున్నాయి. ఖలీద్ ఇప్పటికే సలామా మహ్మద్‌ను పెళ్లి చేసుకోగా.. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. అయితే 2007లో పెళ్లి చేసుకున్న వీరిద్దరూ 2024లో విడాకులు తీసుకున్నారు.
Director Sandeep Raj | నేనే దురదృష్టవంతుడిని.. ‘కలర్ ఫొటో’ దర్శకుడు సందీప్ రాజ్ ఎమోషనల్ పోస్ట్!
Actor Prabhas | జపాన్‌లో భూకంపం.. ప్రభాస్‌కి తప్పిన ప్రమాదం
V. Shantaram Biopic | వి. శాంతారామ్ బయోపిక్‌లో హీరోయిన్గా తమన్నా.. ఫస్ట్ లుక్ రిలీజ్