Anaganaga | చివరగా Aham Reboot సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు టాలీవుడ్ యాక్టర్ సుమంత్ (sumanth). ప్రస్తుతం అనగనగ ఒక రౌడీ సినిమాలో నటిస్తుండగా.. ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. కాగా సుమంత్ కాంపౌండ్ నుంచి మరో సినిమా అప్డేట్ కూడా బయటకు వచ్చింది. సుమంత్ లీడ్ రోల్లో నటిస్తోన్న ఈటీవీ విన్ ఒరిజినల్ చిత్రం అనగనగా (Anaganaga). సన్నీ సంజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు.
సుమంత్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. చిన్నప్పుడు మనం చాలా కథలు వినేవాళ్లం కదా? అవే కథలు మళ్ళీ నెమరు వేయటానికి వస్తున్న మన వ్యాస్ సార్‌కి జన్మదిన శుభాకాంక్షలు.. షేర్ చేసిన లుక్‌తో సుమంత్ ఈ సినిమాలో టీచర్‌గా కనిపించబోతున్నట్టు అర్థమవుతోంది.
స్కూటర్‌పై కొడుకు, భార్యతో సరదాగా వెళ్తున్న పోస్టర్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. కొత్తదనంతో కూడిన సినిమాలు చేసేందుకు ఇష్టపడే సుమంత్ ఈ సారి ఎలాంటి కథతో అందరినీ అలరించబోతున్నాడన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
చిన్నప్పుడు మనం చాలా కథలు వినేవాళ్లం కదా?
అవే కథలు మళ్ళీ నెమరు వేయటానికి వస్తున్న మన వ్యాస్ సార్ కి జన్మదిన శుభాకాంక్షలు!#Anaganaga@etvwin OriginalDirected by Sunny Sanjay@isumanth @Sri_Avasarala @rakeshreddy1224 @pavan_pappula @arvindmule_pd @ashwinrajasheka @chvenkatesh78… pic.twitter.com/UVbjK91lc2
— BA Raju’s Team (@baraju_SuperHit) February 9, 2025