Tribanadhari Barbarik | టాలీవుడ్ డైరెక్టర్ మారుతి (Maruthi) కాంపౌండ్ నుంచి వస్తోన్న చిత్రం త్రిబాణధారి బార్బరిక్ (Tribanadhari Barbarik). మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహిస్తున్నాడు. సత్యరాజ్ లీడ్ రోల్ రోల్లో నటిస్తుండగా.. వశిష్ఠ ఎన్ సింహా, సంచి రాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ మూవీ నుంచి సింగిల్ సెన్సేషన్ సిధ్ శ్రీరామ్ పాడిన నీవల్లే లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేయగా మంచి స్పందన వస్తోంది.
శ్రీసింహా, సంచిరాయ్ బ్యూటీఫుల్ కెమిస్ట్రీలో సాగుతున్న ఈ పాట సినిమాకే హైలెట్‌గా నిలువనుందని విజువల్స్ చెప్పకనే చెబుతున్నాయి. ఇప్పటికే మైథలాజికల్ కాన్సెప్ట్‌తో వస్తోన్న ఈ మూవీ నుంచి సత్యరాజ్ పాత్ర లుక్‌తోపాటు టైటిల్ గ్లింప్స్‌ను షేర్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది. బార్బారిక్ ప్రపంచంలో సత్యరాజ్ పాత్ర కీలకంగా సాగనున్నట్టు గ్లింప్స్ చెబుతోంది. భీముడు మనవడు, ఘటోత్కచుడు కుమారుడు బార్బరిక్ కథ ఆధారంగా ఈ సినిమా వస్తుంది.
గ్లింప్స్‌లో ఎవరు తాతా ఇతను..? అని చిన్నారి అడుగగా.. ప్రపంచం గుర్తించని గొప్ప యోధుడమ్మా.. భీష్ముడా తాతా..? హహ కాదమ్మా.. అంటూ సాగే డైలాగ్స్‌తో మాధవా.. వెయ్యేనుగుల బలశాలి భీముడికి మనవడిని. ఘటోత్కచుడుకు కుమారుడిని అంటూ బార్బరిక్ పాత్రను ఎలివేట్ చేసే ఇంట్రడక్షన్ వీడియో స్టన్నింగ్‌గా సాగుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది.
నీ వల్లే సాంగ్..
మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్‌పై విజయ్‌పాల్ రెడ్డి అడిధాలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో వశిష్ఠ ఎన్ సింహా, సంచి రాయ్, సత్యం రాజేశ్, క్రాంతి కిరణ్, వీటీవీ గణేశ్, మొట్ట రాజేంద్ర, ఉదయ భాను ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
A song that stays with you, note by note! 🎵💖
Experience the soulful #Neevalle lyrical video from #Barbarik, streaming now on @adityamusic!
Composed by 🎼: @BandInfusion
Sung by 🎤: @sidsriramA @DirectorMaruthi Team Product 💥@VijaypalreddyA… pic.twitter.com/pWkxo0zumc
— Aditya Music (@adityamusic) February 8, 2025