Nani | నాని టైటిల్ రోల్లో నటించిన చిత్రం గ్యాంగ్ లీడర్. ఈ మూవీలో ప్రియాంకా అరుళ్మోహన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. ఈ కోలీవుడ్ భామ గ్యాంగ్ లీడర్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ తెచ్చుకోగా.. ప్రియాంకా అరుళ్మోహన్కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. కాగా ఇప్పుడీ క్రేజీ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుందా..? అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. నాని, ప్రియాంకా అరుళ్ మోహన్ మరోసారి కలిసి నటించబోతున్నారన్న వార్త ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఓజీ డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్లో నాని హీరోగా సినిమా వస్తుందని తెలిసిందే. ఈ ప్రాజెక్టులో నాని, ప్రియాంకా అరుళ్ మోహన్ రెండోసారి సిల్వర్ స్క్రీన్‌పై మెరువబోతున్నారని ఓ క్రేజీ గాసిప్ మూవీ లవర్స్‌లో క్యూరియాసిటీ పెంచేస్తుంది. ఇప్పటికే ప్రియాంకా అరుళ్ మోహన్ తో డిస్కషన్స్ పూర్తయ్యాయని.. మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావడమే తరువాయి అని నెట్టింట చర్చ నడుస్తోంది.
నాని-సుజిత్ సినిమా ఇటీవలే గ్రాండ్‌గా లాంచ్ అయిన విషయం తెలిసిందే. నానితో చేయబోయే ఈ చిత్రం ఓజీని బీట్ చేసే విధంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట సుజిత్. నానిని ఇదివరకెన్నడూ చూడని విధంగా నయా అవతార్‌లో చూపించాలాని సుజిత్ గట్టిగా ఫిక్సయినట్టు ఇన్సైడ్ టాక్.
మరి అన్నీ అనుకున్నట్టుగా కుదిరితే నాని-ప్రియాంకా అరుళ్ మోహన్ త్వరలోనే మళ్లీ సందడి చేయనుందన్నమాట. ప్రస్తుతానికి పుకారుగానే ఉన్నా ఈ వార్తను మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మేకర్స్. నాని ప్రస్తుతం దసరా డైరెక్టర్‌తో ది ప్యారడైజ్ సినిమా చేస్తున్నాడని తెలిసిందే.
Kayadu Lohar | ఆ సినిమాకు నా హృదయంలో ప్రత్యేక స్థానం.. తెలుగు మూవీపై కయాదు లోహర్