Janaka Aithe Ganaka | హిట్టు, ఫ్లాపుతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు టాలీవుడ్ యాక్టర్, కలర్‌ఫొటో ఫేం సుహాస్ (Suhas). ఈ టాలెంటెడ్ యాక్టర్ ఇటీవలే ‘జనక అయితే గనక’ (Janaka Aithe Ganaka) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సందీప్‌రెడ్డి బండ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 7న థియేటర్లలో విడుదల కాగా మిక్స్డ్ టాక్ రాబట్టుకుంది.
ముందుగా వచ్చిన అప్డేట్స్ ప్రకారం ఈ చిత్రం నేడు (నవంబర్ 8న) ఆహాలో డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది. ప్రీమియర్ డేట్ కంటే ఒక రోజు ముందే ఆహా గోల్డ్ సబ్ స్క్రైబర్లు వీక్షించే అవకాశముందని ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. ఇవాళ ఆహా గోల్డ్ సబ్ స్క్రైబర్లకు మాత్రమే యాక్సెస్ చేసుకునే అవకాశముంది. మిగిలిన యూజర్లకు రేపటి నుంచి పూర్తిస్థాయిలో సినిమా చూసే అవకాశం కల్పించనుంది ఆహా. మరి ఈ చిత్రానికి ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందనేది చూడాలి.
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్‌రెడ్డి, హన్షిత నిర్మించారు. సంగీత్, వేన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటించారు. నేను ఒకవేళ తండ్రిని అయితే నా వైఫ్‌ను సిటీలో ఉన్న బెస్ట్ ఆస్పత్రిలో చూపించాలి. నా పిల్లలను బెస్ట్ స్కూల్లో చదివించాలి, బెస్ట్ కాలేజిలో చదివించాలి. వాళ్లకి బెస్ట్ లైఫ్ ఇవ్వాలి. బెస్ట్ ఇవ్వలేనప్పుడు పిల్లలను కనకూడదు.. అంటూ సాగే టీజర్, ట్రైలర్ సినిమాపై హైప్ పెంచేశాయి.
#Telugu Movie #JanakaAitheGanaka Now Streaming on #ahaTelugu #JanakaAitheGanakaOnahaTelugu#Suhas #Sangeerthana #VenallaKishore #RajendraPrasad pic.twitter.com/nEhjr2Moye
— OTT Streaming Updates Reviews (@gillboy23) November 8, 2024
Devara | ఓటీటీలో దేవర సందడి.. ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే.. ?