సుహాస్ హీరోగా రూపొందిన చిత్రం ‘గొర్రె పురాణం’. బాబీ దర్శకుడు. ప్రవీణ్‌రెడ్డి నిర్మాత. ఈ నెల 20న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా ట్రైలర్‌ని సోమవారం మేకర్స్ విడుదల చేశారు. ‘నాపేరు రామ్.. అలియాస్ యేసు. గొర్రె జైల్లో వుండటం ఏందీ.. ఆడికెళ్లి తప్పించుకోవడం ఏందీ?.. ఇదంతా మీకు వింతగా వుందికదా..’ అనే వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ మొదలైంది.
ఒక గొర్రె గ్రామంలోని రెండు మతాలమధ్య చిచ్చుపెట్టిన నేపథ్యాన్ని ట్రైలర్లో ఆవిష్కరించారు. గొర్రె వల్ల జరిగిన పరిణామాలు సినిమాలో ఆసక్తికరంగా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. ట్రైలర్లో సుహాస్ ఖైదీగా కనిపించారు.
‘మనం బతకటం కోసం వాటిని చంపేయొచ్చు.. మనది ఆకలి. మరి అవి బతకడం కోసం మనల్ని చంపేస్తే.. అది ఆత్మ రక్షణే కదా..’ అని సుహాస్ చెప్పిన డైలాగ్ ఆలోచన రేకెత్తించేలా ఉంది. పోసాని కృష్ణమురళి, రఘు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సురేష్ సారంగం, సంగీతం: పవన్ సీహెచ్.