సుహాస్, మాళవిక మనోజ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’. రామ్ గోధల దర్శకుడు. వీ ఆర్ట్స్ పతాకంపై హరీష్ నల్ల నిర్మిస్తున్నారు. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. ఈ వేసవిలోనే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
గురువారం ‘ఎలాగుండే వాడ్నే ఎలాగా అయిపోయానే..’ అనే టైటిల్సాంగ్ను విడుదల చేశారు. రథన్ స్వరపరచిన ఈ పాటకు శ్రీహర్ష సాహిత్యాన్ని అందించారు. శరత్సంతోషి ఆలపించారు. ఆద్యంతం ఆహ్లాదభరితంగా సాగే రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇదని, కథానుగుణంగా సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉంటుందని, ఈ వేసవిలో చక్కటి ప్రేమకథగా ఆకట్టుకుంటుందని మేకర్స్ తెలిపారు.