Jatadhara | టాలీవుడ్ యాక్టర్ సుధీర్ బాబు (Sudheer babu) నటిస్తోన్న సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ జటాధర (Jatadhara). వెంకట్ కల్యాణ్ (Venkat Kalyan) కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ తెలుగు, హిందీ బైలింగ్యువల్ సినిమాగా తెరకెక్కుతోంది. ఈ మూవీని నవంబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ఇటీవలే ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ సోల్ ఆఫ్ జటాధర ట్రాక్ ప్రోమోను విడుదల చేశారు.
ఓం నమ : శివాయ్ అంటూ సాగుతున్న సోల్ జటాధర ప్రోమో గూస్బంప్స్ తెప్పిస్తూ సినిమాకే హైలెట్‌గా నిలువనుందని చెప్పకనే చెబుతోంది. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లలో ఓ వైపు శివుడు మరోవైపు చేతిలో త్రిశూలాన్ని పట్టుకున్న సుధీర్‌బాబు, ఇంకోవైపు ఉగ్రరూపంలో కనిపిస్తున్న సోనాక్షి సిన్హా లుక్స్ సినిమా క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి.
ఈ చిత్రంలో బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. శిల్పా శిరోద్కర్ కీలక పాత్ర పోషిస్తోంది. హరోం హర, మా నాన్న సూపర్ హీరో సినిమాలు ఊహించని స్థాయిలో ఢీలా పడిపోయాయి. సుధీర్ బాబు ఇక తన ఆశలన్నీ జటాధర ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ సినిమాపైనే పెట్టుకున్నాడు.
Jacqueline Fernandez | డోన్ట్ కేర్ అంటూ ఫ్యాషన్ వీక్‌లో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ సందడి.. వీడియో
Imanvi | చారిత్రక ప్రదేశాల్లో ప్రభాస్ ఫౌజీ హీరోయిన్ ఇమాన్వీ షికారు
Nagarjuna | నాగార్జున 100వ సినిమా డైరెక్టర్ ఇతడే.. అప్పుడే రిలీజ్ ప్లాన్ కూడా..?