Jatadhara | టాలీవుడ్ యాక్టర్ నవ దళపతి సుధీర్ బాబు (Sudheer babu)నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్ జటాధర (Jatadhara). తెలుగు, హిందీ బైలింగ్యువల్ ప్రాజెక్ట్‌గా వస్తోన్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. రిపబ్లిక్ డే సందర్భంగా వెంకట్ కల్యాణ్ (Venkat Kalyan) కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను షేర్ చేశారు. పాపులర్ జీ స్టూడియోస్ ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కానుంది.
యాక్షన్‌తో నిండిన, ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో సాగే జటాధార మీ మనసును కదిలించబోతుంది. షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభమవుతుంది. అంటూ రిపబ్లిక్ డే సందర్భంగా అప్డేట్ అందించారు మేకర్స్. అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించే నిర్మాణ విలువలతో సినిమా ఉండబోతున్నట్టు తాజా లుక్ చెప్పకనే చెబుతోంది. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. ఈ చిత్రాన్ని శివన్ నారంగ్, ప్రేర్నా అరోరా, నిఖిల్ నందా, ఉజ్వల్ ఆనంద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
గతేడాది హరోం హర, మా నాన్న సూపర్ హీరో సినిమాలో ప్రేక్షకుల ముందుకొచ్చాడు సుధీర్ బాబు. ఈ సారి రూటు మార్చి సూపర్ న్యాచురల్ థ్రిల్లర్‌తో రాబోతుండటంతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగిపోతుంది.
From Rustom to Jatadhara, Zee Studios and Producer Prerna Arora team up again for a gripping thriller! #Jatadhara – ‘A treasure to find, a curse to fight.’ Action-packed and suspenseful, #Jatadhara is going to blow your mind! Shooting begins in February.
Presented by… pic.twitter.com/aBrFEYHtSr
— BA Raju’s Team (@baraju_SuperHit) January 26, 2025
VD14 | రిపబ్లిక్ డే స్పెషల్.. కీ అప్డేట్ షేర్ చేసిన విజయ్ దేవరకొండ టీం
Shafi | పది రోజులుగా వెంటిలేటర్‌పై.. ప్రముఖ దర్శకుడు షఫీ మృతి
SSMB29 Update | సింహన్ని లాక్ చేసిన రాజమౌళి.. SSMB29 ప్రాజెక్ట్ షూరు.!