The Paradise | టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని (Nani) దసరా ఫేం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నటిస్తోన్న రెండో ప్రాజెక్ట్ ది ప్యారడైజ్ (THE PARADISE). ఈ మూవీని ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్లో దసరా ఫేం సుధాకర్ చెరుకూరి తెరకెక్కిస్తున్నారు.
ది ప్యారడైజ్ యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్ పూర్తయిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు కొత్త వార్త ఒకటి అభిమానుల్లో జోష్ నింపుతోంది. నాని టీం నేడు హైదరాబాద్‌లో నయా షెడ్యూల్‌ను షురూ చేసింది. నానితోపాటు ఇతర యాక్టర్లు సెట్స్‌లో జాయిన్ అయినట్టు సమాచారం.
ఈ చిత్రంలో మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తున్నారని ఇటీవలే మంచు లక్ష్మి ఆసక్తికర వార్తను షేర్ కూడా షేరింది. ఇక త్వరలోనే మిగిలిన పాత్రలకు సంబంధించిన వివరాలపై క్లారిటీ ఇవ్వనున్నారట మేకర్స్. చేతికి దసరా, ది ప్యారడైజ్ బ్యాండ్స్ ఉన్న స్టిల్ ఒకటి ఇప్పుడు నెట్టింట రౌండప్ చేస్తోంది.
చరిత్రలో అందరూ చిలకలు..
వైల్డ్ రైడ్ ఎలా ఉండబోతుందో తెలియజేస్తూ విడుదల చేసిన The Paradise Glimpseలో.. చరిత్రలో అందరూ చిలకలు, పావురాల గురించి రాసిర్రు కానీ గదే జాతిలో పుట్టిన కాకుల గురించి రాయలే. ఇది కడుపు మండిన కాకుల కథ. జమానా జమానాకెళ్లి నడిచిన శవాల కథ. అమ్మ రొమ్ములో పాలు లేక రక్తం పోసి పెంచిన ఓ జాతి కథ.. నా కొడుకు నాయకుడైన కథ.. అంటూ డార్క్ షేడ్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతున్న డైలాగ్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నాయి.
హింస, రక్తపాతం, తుపాకులు, గ్లోరీ, ఒక మనిషి.. అంటూ షేర్ చేసిన లుక్‌లో నాని రెండు జడలు, సిక్స్ ప్యాక్ బ్యాడీ, గన్స్‌తో కనిపిస్తూ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాడు. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఓ వైపు బ్లాక్ బస్టర్ దసరా కాంబో కావడం, మరోవైపు నాని-అనిరుధ్ కాంబోలో జెర్సీ, గ్యాంగ్ లీడర్ తర్వాత వస్తున్న సినిమా అవడంతో ది ప్యారడైజ్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి.
🔥🔥
#TheParadise new schedule begins today 🐦⬛🩸
( @odela_srikanth ‘s insta story )@NameisNani @anirudhofficial @SLVCinemasOffl @TheParadiseOffl #Nani pic.twitter.com/SAWdEhB5kW
— Nani Fans Association (@nfa_hyd) September 15, 2025
Mirai | మిరాయ్’లో శ్రీరాముడిగా నటించింది ఎవరో తెలుసా? ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్!
OG | ఓజీ పిల్లర్స్ ఒకే ఫ్రేములో.. మిలియన్ డాలర్ పిక్చర్ అంటూ ట్వీట్