స్టార్ హీరోయిన్ సమంత (Samantha) తన మకాంను ముంబై (Mumbai) కి మార్చేస్తుందా..? అనే ప్రశ్న గతంలోనే తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై సామ్ స్పందిస్తూ..అలాంటిదేమి లేదని..హైదరాబాద్ (Hyderabad) ఎప్పటికీ తన ఇళ్లని స్పష్టం చేసింది. కానీ ఇటీవల కాలంలో గమనిస్తే..సమంత హైదరాబాద్‌లో కంటే ఎక్కువగా ముంబైలోనే కనిపిస్తుంది. అంతేకాదు తన అప్‌కమింగ్ సినిమా యశోద (Yashoda) షూటింగ్ లో పాల్గొనేందుకు ముంబై నుంచి హైదరాబాద్‌కు వచ్చి వెళ్తుందట.
సమంత హిందీ వెబ్ డ్రామాలతోపాటు మరిన్ని బాలీవుడ్ (Bollywood) ప్రాజెక్టులు చేసేందుకు ప్లాన్ చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో సామ్ తన మకాంను ముంబైకి మార్చేసే ప్రయత్నాలు మొదలుపెట్టిందని ఓ వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ముంబైలో ఇంటి కోసం వెతికే పనిలో పడిందట సామ్. ఇదే నిజమైతే..సమంత తన అసైన్ మెంట్స్ ను చూసుకోవడానికి ముంబైలో కొత్త మేనేజర్‌ను అపాయింట్ చేసుకోబోతుందని టాక్ నడుస్తోంది.
తాజాగా బయటకు వచ్చిన అప్ డేట్స్ చూస్తుంటే సమంత వీలైనంత త్వరగా ముంబైకి షిఫ్ట్ కాబోతుందని అర్థమవుతుంది. మరోవైపు శివ నిర్వాణ (Samantha) దర్శకత్వంలో విజయ్ దేవరకొండతో కలిసి లవ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్లో నటించనుంది సామ్. ఈ చెన్నై సుందరి వన్ ఆఫ్ ది ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తున్న కాతువాకుల రెండు కాధల్ ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. మరోవైపు గుణశేఖర్ డైరెక్షన్లో నటిస్తోన్న శాకుంతలం షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసింది.