Trivikram Seasonal Heroines| త్రివిక్రమ్ సీజనల్ హీరోయిన్స్
Hegde)..ఏంటి రిలేషన్.. వీళ్ళ మధ్య లింక్ ఏంటని ఆలోచిస్తున్నారా..? కాస్త ఆలోచిస్తే ఈ ముగ్గురి మధ్య ఉన్న చిక్కుముడి విడిపోతుంది.

అప్పుడు ఇలియానా (Iliana)..మధ్యలో సమంత(Samantha)..ఇప్పుడు పూజా హెగ్డే (Pooja Hegde)..ఏంటి రిలేషన్.. వీళ్ళ మధ్య లింక్ ఏంటని ఆలోచిస్తున్నారా..? కాస్త ఆలోచిస్తే ఈ ముగ్గురి మధ్య ఉన్న చిక్కుముడి విడిపోతుంది. తెలుగు ఇండస్ట్రీలో ఈ ముగ్గురికి అద్భుతమైన ఇమేజ్ ఉంది. ఒకప్పుడు ఇలియానా నెంబర్ వన్ హీరోయిన్.. ఆ తర్వాత సమంత అక్కినేని కూడా నెంబర్ వన్ హీరోయిన్.. పూజా హెగ్డే అగ్రపీఠం కోసం ప్రయత్నిస్తుంది. ఇక ఈ ముగ్గురిలో ఇప్పుడు ఉన్న కామన్ పాయింట్ చూద్దాం. ఈ ముగ్గురు హీరోయిన్లకు త్రివిక్రమ్ శ్రీనివాస్ అనే ఒక కామన్ దర్శకుడు ఉన్నాడు. వీళ్ళ మధ్య లింక్ ఈయనే. ఒక్కో సీజన్ లో ఒక హీరోయిన్ కు ఎంత బాగా కనెక్ట్ అవుతుంటాడు. వరుసగా చేసే సినిమాలకు వాళ్లని హీరోయిన్లుగా తీసుకుంటాడు త్రివిక్రమ్ (Trivikram Srinivas).
ఒక్కసారి కనెక్ట్ అయితే రిపీట్ చేస్తూనే ఉంటాడు ఈయన. అది హీరో అయినా.. హీరోయిన్ అయినా..! 13 ఏళ్ల కింద జల్సా సినిమా తీసినప్పుడు తొలిసారి ఇలియానాను హీరోయిన్ గా తీసుకున్నాడు త్రివిక్రమ్. ఆ సినిమా సమయంలో ఇలియానా టాప్ హీరోయిన్. ఆ తర్వాత మూడేళ్లకు జులాయి సినిమాలో మరోసారి హీరోయిన్ గా రిపీట్ చేశాడు. అయితే ఆ టైంకు గోవా బ్యూటీ క్రేజ్ పోయింది. అయినా కూడా ఇలియానాకు అవకాశం ఇచ్చాడు. ఇక అత్తారింటికి దారేది సినిమాతో తొలిసారిగా సమంతతో వర్క్ చేశాడు మాటల మాంత్రికుడు. ఆ వెంటనే సన్ ఆఫ్ సత్యమూర్తి, అ..ఆ సినిమాల్లో కూడా ఆమెనే రిపీట్ చేశాడు.
ఇప్పుడు పూజా హెగ్డే వంతు. అరవింద సమేత సినిమాలో తొలిసారి పూజా హెగ్డేతో పని చేసిన త్రివిక్రమ్.. గతేడాది అల వైకుంఠపురంలో సినిమాలో ఆమెనే ఎంపిక చేసుకున్నాడు. ఇప్పుడు మహేష్ బాబుతో చేయబోయే సినిమాలో కూడా పూజాహెగ్డే హీరోయిన్ గా నటించబోతోంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. వరుసగా మూడోసారి పూజాతోనే సినిమా చేస్తున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ సినిమా తర్వాత మళ్లీ ఆ స్థాయిలో మాటల మాంత్రికుడు కి కనెక్ట్ అయ్యే హీరోయిన్ ఎవరో చూడాలి.
ఇవి కూడా చదవండి..
Nayanthara Engagement| ఎంగేజ్మెంట్ అయిపోందని చెప్పిన నయనతార
Vijayendraprasad on RGV| ఆ ఆర్జీవీ ‘కనబడుటలేదు’.. విజయేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్
Mahesh Babu| స్టార్ డైరెక్టర్ కొడుకు మహేశ్ బాబుకు వీరాభిమాని అట..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

