రాజమౌళి సినిమాలే కాదు, ప్రమోషన్లు కూడా భిన్నంగా ఉంటాయి. నిర్మాణంలో ఉండగానే ప్రమోషన్స్‌తో సినిమాపై హైప్ తీసుకొస్తారాయన. అయితే.. ప్రస్తుతం చేస్తున్న ‘SSMB 29’ విషయంలో మాత్రం ప్రమోషన్ ఊసే లేకుండా, చడీచప్పుడు చేయకుండా వేగంగా షూటింగ్ చేసుకుంటూపోతున్నారాయన. నిజానికి ఈ నెల 9న మహేశ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు చెందిన ఏదైనా అప్డేట్ వస్తుందేమోనని సగటు ప్రేక్షకుడు సైతం ఎదురుచూశాడు. కానీ అలా జరగలేదు. కేవలం ప్రీ లుక్ విడుదల చేసి, ఫస్ట్ లుక్ నవంబర్‌లో వస్తుందని ప్రకటించారు.
దీంతో అంతా సూపర్‌స్టార్ లుక్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే.. నవంబర్‌లో మహేష్ ఫస్ట్ లుక్ రిలీజ్ వెనుక పెద్ద ప్లానే ఉందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. డిసెంబర్ 19న ‘అవతార్: ది ఫైర్ అండ్ యాష్’ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నవంబర్‌లో డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ ఇండియాకు రానున్నారని సమాచారం. అలా వచ్చిన కామెరూన్ చేత మహేష్ ఫస్ట్‌లుక్‌తోపాటు ‘SSMB 29’ గ్లింప్స్‌ను కూడా రిలీజ్ చేసేందుకు రాజమౌళి ప్లాన్ చేశారని ఫిల్మ్ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జక్కన్న ప్లాన్ మామూలుగా లేదుగా అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.