SSMB 29 | గ్లోబల్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) సినిమా అంటే విజువల్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. జక్కన్న వీఎఫ్ఎక్స్ పార్ట్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లేలా ఉంటుంది. అందుకు మగధీర, ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలే ఉత్తమ ఉదాహరణగా చెప్పొచ్చు. అందుకే భారతీయ సినీ చరిత్రలో జక్కన్న సినిమాలు చాలా ప్రత్యేకమైనవిగా నిలిచాయి. కాగా ఇప్పుడిక ఎస్ఎస్ఎంబీ 29 (SSMB 29) సినిమాతో బిజీగా ఉన్నాడు ఎస్ఎస్ రాజమౌళి. మహేశ్ బాబు లీడ్ రోల్లో నటిస్తోన్న ఈ మూవీ ఆఫ్రికన్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్‌గా రాబోతుంది.
భారత్‌లో కొన్ని కీలక షెడ్యూల్స్ షూట్ చేసిన జక్కన్న టీం నెక్ట్స్ షడ్యూల్ కోసం ప్రస్తుతం నైరోబిలో ల్యాండ్ అయింది. ఇప్పటికే మూవీ హీరోయిన్ ప్రియాంకా చోప్రా ప్రైడ్ ల్యాండ్స్ (సింహాలకు ఆవాసమైన సవన్నా భూభాగం)లో సఫారీ రైడ్ చేసి హైనా, హిప్పోపొటామస్, ఆస్ట్రిచ్, ఆఫ్రికన్ బఫెలో లాంటి వాటిని కెమెరాలో బంధించి ఆ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇక ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు, మూవీ లవర్స్ సినిమా గురించి ఆసక్తికర చర్చ తెరపైకి తెచ్చారు.
ఇంతకీ విషయమేంటంటే ఈ సినిమా కోసం జక్కన్న సీజీ వర్క్స్‌కు బదులు కొత్త మెథడ్‌ను ఫాలో అవుతున్నాడని చర్చించుకుంటున్నారు. సినిమాలోని సన్నివేశాలను రియలిస్టిక్‌గా చూపించి అభిమానులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు జక్కన్న టీం నైరోబీలోని జంగిల్లో సఫారీ రైడ్ చేస్తూ ఇలా జంతువులను షూట్ చేస్తున్నారని అంటున్నారు. సెరెంగెటి నేషనల్ పార్క్ టాంజానియాతోపాటు ఇతర లొకేషన్లలో నెక్ట్స్ షెడ్యూల్ కొనసాగనుంది. అంటే సీజీకి బదులు కెమెరాతో తీసిన రియలిస్టిక్ సీన్లను సినిమాలో చూపించనున్నాడన్నమాట.
మేకర్స్ ముందుగా చెప్పినట్టుగానే ఈ చిత్రం అద్భుతమైన గ్లోబల్ యాక్షన్ అడ్వెంచరస్ డ్రామా కాబోతుందని తాజా వార్తలు మరోసారి హింట్ ఇచ్చేస్తున్నాయి. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మాలీవుడ్ స్టార్ యాక్టర్ పృథ్విరాజ్ సుకుమారన్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. మరి రాబోయే రోజుల్లో ఎస్ఎస్ రాజమౌళి టీం నుంచి ఏదైనా అధికారిక అప్డేట్ వస్తుందేమో చూడాలి.
🚨 Exclusive : Gen 63 (#SSMB29) Shooting will be held at Serengeti National Park Tanzania and Some other locations 😲
S.S Rajamouli focusing on Shooting on Live Location instead of Studio of whole Blue/ Green Screen to keep Movie Feel Authentic 🤯#MaheshBabu #GlobeTrotter pic.twitter.com/zSdZYzdqRv
— Globe Trotter Updates (@GlobeTrotterFil) August 20, 2025
Mandaadi | ఈ సారి తగ్గేదేలే అంటున్న సుహాస్.. హైప్ పెంచుతోన్న మండాడి స్పెషల్ పోస్టర్
War 2 | కూలీ చిత్రాన్ని అందుకుంటుందా..? తారక్, హృతిక్ రోషన్ వార్ 2 బాక్సాఫీస్ వసూళ్లు ఇవే
Shruti Haasan | నంబర్ గేమ్ కొత్త సమస్య.. కమల్ హాసన్ థగ్‌లైఫ్ ఫెయిల్యూర్‌పై శృతిహాసన్