Shruti Haasan | తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ టైటిల్ రోల్ పోషించిన కూలీ సినిమాలో కీలక పాత్రలో నటించింది శృతిహాసన్. కూలీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు,కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే ఈ భామ కూలీ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో తన తండ్రి కమల్ హాసన్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తున్నాయి.
మణిరత్నం డైరెక్షన్లో కమల్ హాసన్ లీడ్ రోల్లో నటించిన థగ్‌లైఫ్ బాక్సాఫీస్ వద్ధ ఊహించని విధంగా బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఇంటర్వ్యూలో థగ్‌లైఫ్ ఫెయిల్యూర్ మీ తండ్రిపై ప్రభావం చూపుతుందా.? అని అడిగిన ప్రశ్నకు శృతిహాసన్ తనదైన శైలిలో స్పందించింది. పదేళ్ల క్రితం నంబర్స్ (అంకెలు) కు సంబంధించిన చర్చ జరుగలేదు. తన సొంత డబ్బంతా సినిమాకే ఖర్చు పెట్టే మనస్తత్వం నుండి నాన్నగారు వచ్చారు. జనాలు అంచనాలు వేసే నంబర్ గేమ్స్ ఆయనను ప్రభావితం చేయవంది శృతిహాసన్. అంతేకాదు ఇది (నంబర్ గేమ్) నవతరం ధనవంతుల సమస్య అని నేను అనుకుంటున్నానని చెప్పుకొచ్చింది.
కమల్ హాసన్ స్వభావం మీ మీద పడిందా అని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. అవును ఆయన స్వభావం (నీడ) నాపై ఎప్పుడూ ఉంటుంది. కానీ దానిని ఎదుర్కొంటానా..? లేదా అది అక్కడే ఉందని తెలుసుకుని నా డైరెక్షన్లో నేను నడుస్తున్నానా..? అనేది తెలియాలి. అప్పా (నాన్న) నాలోని వెలుగును కప్పి ఉంచే నీడగా కంటే.. నా జీవితంలో నీడను సృష్టించే సూర్యుడిలా ఉంటారంది శృతిహాసన్. మొత్తానికి శృతిహాసన్ తన తండ్రి గురించి గొప్పగా చెప్పకనే చెబుతూ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Coolie | తగ్గేదే లే అంటోన్న తలైవా.. బాక్సాఫీస్ వద్ద లోకేశ్ కనగరాజ్ కూలీ ఊచకోత
Toxic | యశ్ టాక్సిక్‌లో మరో భామ.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..?