War 2 | టాలీవుడ్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) బాలీవుడ్ డెబ్యూ ఇచ్చిన చిత్రం వార్ 2 (War 2). అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ హృతిక్ రోషన్ (Hrithik Roshan) మరో లీడ్ రోల్లో నటించాడు. బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఫీమేల్ లీడ్ రోల్లో నటించిన ఈ మూవీ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది.
కాగా మేకర్స్ వార్ 2 వరల్డ్ వైడ్ తాజా వసూళ్లను ప్రకటించారు. యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. వార్ వరల్డ్‌వైడ్‌గా రూ.300.50 కోట్లు గ్రాస్ రాబట్టింది. వీటిలో ఇండియా నుంచి రూ.240 కోట్లు వసూళ్లు చేయగా.. ఓవర్సీస్లో రూ.60.50 కోట్లు రాబట్టింది. అయితే వార్ 2తోపాటే విడుదలైన కూలీ సినిమా కలెక్షన్లతో పోలిస్తే ఈ ఫిగర్ తక్కువే. కూలీ వరల్డ్‌వైడ్‌గా రూ.404 కోట్లకుపైగా వసూళ్లతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. మరి కూలీ సినిమా వసూళ్లను వార్ 2 చేరుకుంటుందా..? అనేది చూడాలి.
వార్ 2 YRF Spy Universeలో ఏక్తా టైగర్, టైగర్ జిందా హై, వార్, పఠాన్, టైగర్ 3 సినిమాల తర్వాత వచ్చిన ఆరో సినిమా వార్ 2. మరి సెకండ్ వీక్‌లో వార్ 2 బాక్సాఫీస్ వసూళ్లు ఎలా ఉంటాయో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.
Catch the action-packed entertainer on the big screen! 🔥 #War2 in cinemas now in Hindi, Telugu and Tamil. Book your tickets! https://t.co/empQLqeFMr | https://t.co/XOIHwYhw6h @iHrithik | @tarak9999 | @advani_kiara | #AyanMukerji | #YRFSpyUniverse pic.twitter.com/oktKXlr7lM
— Yash Raj Films (@yrf) August 19, 2025
Coolie | తగ్గేదే లే అంటోన్న తలైవా.. బాక్సాఫీస్ వద్ద లోకేశ్ కనగరాజ్ కూలీ ఊచకోత
Toxic | యశ్ టాక్సిక్‌లో మరో భామ.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..?