Rajamouli | దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie) చిత్రం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ఇప్పటికే ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డును కూడా అందుకుంది. తాజాగా మరో అరుదైన గౌరవం దక్కింది. ఈ చిత్రంలోని ఆరుగురు సభ్యులకు ఆస్కార్ (Oscar) కమిటీలో అవకాశం లభించింది.
దీనిపై దర్శకధీరుడు రాజమౌళి తాజాగా స్పందించారు. ఈ సంవత్సరం అకాడమీ అవార్డుల కోసం తమ ‘ఆర్ఆర్ఆర్’ బృందంలోని ఆరుగురిని సభ్యులుగా ఆహ్వానించినందుకు చాలా గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘ఈ సంవత్సరం అకాడమీ అవార్డులకు మా ‘ఆర్ఆర్ఆర్’ బృందంలోని ఆరు మందిని ఆస్కార్ కమిటీ సభ్యులుగా ఆహ్వానించడం చాలా గర్వంగా ఉంది. తారక్, చరణ్, పెద్దన్న (కీరవాణి), సాబు సిరిల్, సెంథిల్, చంద్రబోస్ గారికి అభినందనలు. అలాగే ఈ సంవత్సరం ఆహ్వానం అందుకున్న భారతీయ సినిమా సభ్యులందరికీ అభినందనలు’ అంటూ జక్కన్న ట్వీట్ చేశారు.
Extremely proud that 6 members of our RRR team have been invited as members for The Academy Awards this year.
Congratulations Tarak, Charan, Peddanna, Sabu sir, Senthil &Chandrabose garu.
Also, congrats to the members from Indian Cinema who received the invitation this year 🙂
— rajamouli ss (@ssrajamouli) June 29, 2023
ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డులను ప్రదానం చేసే ‘ద అకాడమీ ఆఫ్ మోషనల్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ (The Academy of Motion Pictures and Sciences) కొత్తగా ఆస్కార్ కమిటీలో 398 మందికి సభ్యత్వం కల్పించింది. ఆ జాబితాను తాజాగా విడుదల చేసింది. ఇందులో ‘ఆర్ఆర్ఆర్’ టీంకు చెందిన ఆరుగురు ఉండటం విశేషం. స్టార్ నటులు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్ (Ram Charan) తోపాటు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి (MM Keeravani), గేయ రచయిత చంద్రబోస్, ఛాయాగ్రాహకుడు సెంథిల్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ లకు ఈ కమిటీలో స్థానం దక్కింది. ఇక బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కు కూడా స్థానం లభించింది.
అయితే, ఈ లిస్ట్ లో రాజమౌళికి చోటు దక్కకపోవడంపై అభిమానులు నిరాశకు గురవుతున్నారు. ఎంతో కృషి చేసిన జక్కన్నకు ఈ గౌరవం దక్కి ఉంటే బాగుండేది అంటూ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
Also Read..
RRR | ప్రౌడ్ మూమెంట్.. ఆస్కార్ జ్యూరీ సభ్యులుగా చరణ్, ఎన్టీఆర్
Viral Video | బైక్ పై ప్రమాదకర స్టంట్లతో గాయాలపాలైన జంట.. వీడియో షేర్ చేసిన ఢిల్లీ పోలీసులు
Joe Biden | నిద్రలేమితో బాధపడుతున్న అమెరికా అధ్యక్షుడు.. వెల్లడించిన వైట్ హౌస్