ICC : టీ20 ప్రపంచకప్ నిర్వహణకు సిద్ధమవుతున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC)కి కొత్త తలనొప్పి మొదలైంది. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మెగా టోర్నీ ప్రారంభం కానుండగా.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) బాంబ్ పేల్చింది. ఐపీఎల్ నుంచి పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్(Mustafizur Reshman)ను తొలగించడానికి ప్రతిచర్యగా, భారత్‌లో ప్రపంచకప్ ఆడమని బంగ్లా తేల్చి చెప్పేసింది. దాంతో.. ఇదివరకే ప్రకటించిన షెడ్యూల్‌ను మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బంగ్లాదేశ్‌లో మైనార్టీలైన హిందువులపై హత్యాకాండ తదనంతర పరిణామాలు క్రికెట్‌పై పడ్డాయి. అల్లర్లతో అట్టుడుకుతున్న బంగ్లాతో దౌత్య సంబంధాలకు బ్రేక్ వేసిన భారత్.. క్రికెట్ సంబంధాల్ని కూడా కట్ చేసింది. హిందువుల హత్యలను నిరసిస్తూ ఐపీఎల్ నుంచి బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ (Mustafizur Reshman)ను తొలగించింది.
ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వరల్డ్‌కప్ ఆడేందుకు తమ జట్టును ఇండియాకు పంపమని ఐసీసీకి ఈ-మెయిల్ చేసింది. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా తమ టీమ్ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని కోరింది. దాంతో.. ఇప్పటికే షెడ్యూల్ వెలువరించి ప్రపంచకప్ నిర్వహణపై కసరత్తు చేస్తున్న ఐసీసీ ఆలోచనలో పడింది. బంగ్లా బోర్డు విజ్జప్తిని పరిశీలిస్తున్న జై షా నేతృత్వంలోని ఐసీసీ త్వరలోనే కొత్త షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశముంది.
Bangladesh will ask the ICC to relocate their T20 World Cup matches from India to Sri Lanka, after KKR were instructed to release Mustafizur Rahman as a result of deteriorating political ties between Bangladesh and India
Full story: https://t.co/WYhF1tbnyN pic.twitter.com/0ELAc4uFCM
— ESPNcricinfo (@ESPNcricinfo) January 3, 2026
ఇటీవల బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను ఖండిస్తున్న భారత ప్రభుత్వం.. ఆ దేశంతో దౌత్య సంబంధాలకు బ్రేక్ వేసింది. అంతేకాదు కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) ఇటీవలవేలంలో రూ.9.1 కోట్లు పలికిన బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను కొనడంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. అతడిని స్క్వాడ్ నుంచి తప్పించాలని బీసీసీఐ ఆదేశించింది. జనవరి 4 ఆదివారం సమావేశమైన బోర్డు సభ్యులు ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్ నుంచి తప్పించిన బీసీసీఐని తప్పుపట్టారు. భద్రతా కారణాలతో భారత్‌కు తమ జట్టును పంపమని బోర్డు వెల్లడించింది.
🚨 BCCI VS BCB FINISHED IN NO SOLUTION 🚨
– After a brief talk between the BCCI and BCB, the Bangladesh Cricket Board refused to travel to India for the T20 World Cup, citing player ‘safety and well-being’ concerns 😨
– What’s your take 🤔 pic.twitter.com/1l3booRh5r
— Richard Kettleborough (@RichKettle07) January 4, 2026
‘భద్రతా కారణాల రీత్యా మా జట్టును ప్రపంచకప్ కోసం భారత్‌కు పంపించడం సాధ్యం కాదు. బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నాం. బీసీసీఐ నిర్ణయానికి కౌంటర్‌గా మేము ఈ తీర్మానం చేశాం. మా జట్టు మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించండి’ అని బంగ్లా క్రికెట్ బోర్డు ఆదివారం ఐసీసీకి పంపిన ఈ-మెయిల్లో తెలిపింది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 7న ఈడెన్ గార్డెన్స్ మైదానంలో బంగ్లాదేశ్, వెస్టిండీస్ తలపడాలి. కానీ, బంగ్లా బోర్డు విన్నపం నేపథ్యంలో ఆ జట్టు మ్యాచ్‌లను శ్రీలంకలో నిర్వహించడంపై ఐసీసీ ఆలోచిస్తోంది.
టీ20 ప్రపంచకప్ స్క్వాడ్ : లిటన్ కుమార్ దాస్(కెప్టెన్), మొహమ్మద్ సైఫ్ హొసేన్(వైస్ కెప్టెన్), తంజిద్ హసన్, పర్వేజ్ హొసేన్, తౌహిద్ హృదయ్, షమీమ్ హొసేన్, కాజీ నురుల్, మహేది హసన్, రిషద్ హొసేన్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, తంజిమ్ హసన్, తస్కిన్ అహ్మద్, షైఫుద్దీన్, షొరిఫుల్ ఇస్లాం.