They Call Him OG | టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కాంపౌండ్ నుంచి వస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టుల్లో ఒకటి ఓజీ (OG). ఈ చిత్రానికి సాహో ఫేం సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. మేకర్స్ ఇప్పటికే ఓజీ నుంచి లాంఛ్ చేసిన HUNGRYCHEETAH గ్లింప్స్ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తూ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తుంది. ఓజీలో గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంకా ఆరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితురాలైన శ్రియారెడ్డి కీలక పాత్రలో నటిస్తుంది.
తాజాగా శ్రియారెడ్డికి సంబంధించిన ఆసక్తికర వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. శ్రియా రెడ్డి ఇండియన్ మార్షల్ ఆర్ట్ కలరిపయట్టు నేర్చుకునే పనిలో ఉందని ఇన్ సైడ్ టాక్.. కాగా దీనికి సంబంధించిన స్టిల్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. శ్రియా రెడ్డి సాధారణంగా రెగ్యులర్ హీరోయిన్లలా కాకుండా ఫిజికల్‌గా పోటీ పడే పాత్రలను ఎంపిక చేసుకుంటుందని గత సినిమాలు చూస్తే తెలిసిపోతుంది. ఈ సారి కూడా ఓజీలో తన పాత్రకు న్యాయం చేసేందుకు అవసరమైన కఠినమైన శిక్షణలో బిజీగా ఉందన్నమాటశ్రియా రెడ్డి. 11-12వ శతాబ్దాల మధ్యకాలంలో ప్రాచుర్యం పొందింది మార్షల్ ఆర్ట్ కలరిపాయట్టు.
సుజిత్ ప్రేక్షకుల కోసం ఓజీ ప్రపంచంలో ఎలాంటి బలమైన పాత్రలను సృష్టిస్తున్నాడో మీరస్సలు ఊహించలేరు. ఓజీలో వచ్చే ఓ ప్రత్యేకమైన సీన్ మీ మైండ్ బ్లాంక్ అవడం గ్యారంటీ. ఈ చిత్రంలో 50 శాతం యాక్షన్, 50 శాతం ఎమోషన్స్ ఉండేలా పాత్రలను సుజిత్ డిజైన్ చేశాడని, ఓజీ ప్రపంచాన్ని మీరెవరూ ఊహించలేరంటూ ఇప్పటికే ఓ చిట్‌చాట్‌లో శ్రియా రెడ్డి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రానికి రవి కే చంద్రన్ సినిమాటోగ్రాఫర్ కాగా.. ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్.
Devara | దేవరకు నాలుగు కట్స్ చెప్పిన సెన్సార్ బోర్డు .. ఇంతకీ అవేంటో తెలుసా..?
Nandamuri Balakrishna | వరద బాధితులకు నందమూరి బాలకృష్ణ భారీ విరాళం
Pawan Kalyan | జెట్టీ యాక్టర్ కృష్ణకు పవన్ కల్యాణ్ ప్రశంసలు.. కారణమిదే.. !
Bad Newz | తృప్తి డిమ్రి బ్యాడ్ న్యూజ్ను ఇక ఉచితంగా చూసేయొచ్చు.. ప్లాట్‌ఫాం ఇదే
ఓజీ గ్లింప్స్..