ఇటీవలే సార్పట్టా పరంబరై సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు కోలీవుడ్ హీరో ఆర్య (Arya). ఈ చిత్రంలో ఆర్య నటనకు ప్రశంసలు వెల్లువెత్తాయి. అయితే ఆర్యపై శ్రీలంకన్ మహిళ ఛీటింగ్ కేసు (cheating case)పెట్టినట్టు ఓ వార్త ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. విడ్జా (Vidja) అనే శ్రీలంకన్ మహిళ ఆర్య తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని చెన్నై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. జర్మనీలో నివసిస్తున్న విడ్జా ప్రత్యక్షంగా రాలేకపోవడంతో ఆన్ లైన్ ద్వారా తన ఫిర్యాదు నమోదు చేసింది.
ఆర్యకు తాను రూ.70 లక్షలు నగదు కూడా ట్రాన్స్ ఫర్ చేసినట్టు ఫిర్యాదులో పేర్కొంది. ఆర్యకు, తనకు మధ్య జరిగిన చాటింగ్ ను సాక్ష్యంగా పొందుపరిచింది విడ్జా. అయితే చెన్నై పోలీసులు వెంటనే ఆర్యను విచారణకు హాజరుకావాలని నిర్దేశించారు. ఈ మేరకు ఆర్య చెన్నై పోలీస్ కమిషనర్ ఎదుట హాజరు కాగా..మూడు గంటలపాటు పోలీసులు ఆర్యను ప్రశ్నించినట్టు సమాచారం. ఈ కేసు కోర్టుకు చేరింది. తదుపరి విచారణ ఆగస్టు 17న జరుగనుంది.
ఈ వ్యవహారంలో మీడియా ఆర్యను కలిసేందుకు ప్రయత్నించగా..ఆర్య అందుబాటులోకి రాలేదు. మరి ఈ కేసుపై ఆర్య ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి. ఆర్య తన కోస్టార్ సయేషా సెహెగల్ ని 2019లో వివాహం చేసుకున్నాడు. గత నెలలో వీరింట పండంటి పాపాయి అడుగుపెట్టింది.
ఇవి కూడా చదవండి..
Nayanthara Engagement| ఎంగేజ్మెంట్ అయిపోందని చెప్పిన నయనతార
Vijayendraprasad on RGV| ఆ ఆర్జీవీ ‘కనబడుటలేదు’.. విజయేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్
Mahesh Babu| స్టార్ డైరెక్టర్ కొడుకు మహేశ్ బాబుకు వీరాభిమాని అట..!