టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని (Nani), డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో దసరా (Dasara) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా సింగరేణి బ్యాక్ డ్రాప్లో వస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయిందని ఓ నెటిజన్ పెట్టిన కామెంట్‌కు సెటైరికల్ జిఫ్ ఫైల్‌తో రిప్లై ఇచ్చాడు డైరెక్టర్. ఆ వెంటనే ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా నాని అండ్ టీంతో దసరా కొత్త షెడ్యూల్ మొదలుపెట్టేశాడు శ్రీకాంత్ ఓదెల.
ఈ విషయాన్ని నాని ట్విటర్ ద్వారా షేర్ చేసుకున్నాడు. లాంగ్ షెడ్యూల్లో జాయిన్ అయ్యాను. తర్వాతి షెడ్యూల్ మొదలైంది..అంటూ ట్వీట్ పెట్టాడు నాని. ఈ చిత్రంలో కోలీవుడ్ భామ కీర్తిసురేశ్ (Keerthy Suresh) ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
సంతోష్ నారాయణన్-సత్యన్ సూర్యన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నాని మరోవైపు నిర్మాతగా రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. HIT: The Second Case, Meet Cute చిత్రాలను నిర్మిస్తున్నాడు నాని.
I join 🙂
This one’s a long one.
Next Schedule Begins #Dasara pic.twitter.com/dQ5iXqq0MP— Nani (@NameisNani) July 1, 2022
Read Also : Pavitra lokesh | నరేశ్ మంచి వ్యక్తి..మీడియాతో పవిత్రా లోకేశ్..తెరపైకి మూడో భార్య..!
Read Also : Genelia D’Souza | జెనీలియా గ్రాండ్ రీఎంట్రీ..క్రేజీ సినిమా వివరాలివే..!