Arjuna Phalguna in OTT | విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో శ్రీ విష్ణు. గత ఏడాది రాజ రాజ చోర సినిమాతో హిట్ అందుకున్న శ్రీవిష్ణు.. 2021 చివరలో అర్ణుణ ఫల్గుణ అంటూ పలకరించాడు. అమృత అయ్యర్ కథానాయికగా నటించిన ఈ సినిమా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కింది. డిసెంబర్ 31న విడుదలైన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. కానీ కరోనా కేసులు పెరగడం, సినిమా టికెట్ల ధరల వంటి కారణాల వల్ల పెద్దగా కలెక్షన్లను రాబట్టలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రావడం ఫిక్సయిపోయింది.
A fun yet thrilling ride of friendship, love & greed will premiere on Jan 26. #ArjunaPhalgunaOnAHA@sreevishnuoffl @MatineeEnt @DirTejaMarni #AnveshReddy @pasha_always @Actor_Amritha @adityamusic pic.twitter.com/OCzWaiB8fW
— ahavideoIN (@ahavideoIN) January 13, 2022
అర్ణుణ ఫల్గుణ సినిమా థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకు ఓటీటీలోకి వచ్చేస్తోంది. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ఈ సినిమా ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. గోదావరి జిల్లా నేపథ్యంలో రూపొందిన అర్జుణ ఫల్గుణ సినిమాలో శ్రీ విష్ణు.. యంగ్‌టైగర్ ఎన్టీఆర్ వీరాభిమానిగా నటించాడు. అమృత అయ్యర్ గ్రామ వాలంటీర్‌గా నటించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Skylab movie in OTT | ఓటీటీలోకి సత్యదేవ్ స్కైలాబ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Akhanda | అఖండ ఓటీటీ రిలీజ్ ఫిక్స్ .. డిస్నీ హాట్‌స్టార్‌లో గర్జించేది అప్పుడే
Shyam singharoy | ఓటీటీలో శ్యామ్ సింగరాయ్ సినిమా.. వచ్చేది అప్పుడేనా?