Sri Ram | హీరో శ్రీరామ్ డ్రగ్స్ కేసు వ్యవహారం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇన్నోసెంట్‌గా కనిపించే శ్రీరామ్ డ్రగ్స్ తీసుకున్నాడంటే ఎవరు నమ్మలేకపోతున్నారు. శ్రీరామ్‌ను కోర్టులో హాజరు పరిచిన సమయంలో తాను చేసిన తప్పును ఒప్పుకొన్నారు. అలానే డ్రగ్స్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో కూడా కోర్టుకు తెలియజేశాడు. అయితే ఈ ఘటనపై చాలా గిల్టీగా ఫీలవుతున్నాడు శ్రీరామ్ . కొకైన్ వాడటం చట్టవిరుద్ధమని నాకు తెలియదు. తెలియకుండానే తప్పు జరిగింది. కానీ, ఇప్పుడు నా కుటుంబం, ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు గురించి చాలా భయంగా ఉంది అని హీరో శ్రీరామ్ అన్నట్టు సమాచారం.
ఇప్పుడు జైలు జీవితాన్ని ఎదుర్కొంటున్నాను. నేను లేకుండా నా పిల్లలు ఉండలేరు. నేను చేసిన తప్పు ఇంత ప్రభావం చూపుతుందని అస్సలు ఊహించలేదు అని హీరో శ్రీరామ్ అన్నాడు. ఇక చలనచిత్ర రంగానికి ఎలాంటి నేపథ్యం లేకుండానే వచ్చాడు శ్రీరామ్. 2002లో దర్శకుడు శశి తెరకెక్కించిన ‘రోజా కూట్టం’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశాడు. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు అతనికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.ఈ సినిమా తర్వాత ఏప్రిల్ మఠం , మనసెల్లం , పార్తిబన్ కనవు లాంటి సినిమాల్లో నటించి మంచి ఆదరణ పొందాడు. వర్ణజలం , బోస్ , కాన కండెన్ , పంబరకన్నలే వంటి చిత్రాలు విమర్శకుల ప్రశంసలు కూడా పొందాయి. అయితే, కొన్ని సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో కెరీర్లో ఒడిదుడుకులు ఎదురయ్యాయి.
శ్రీరామ్ లవ్ విషయంలో కూడా పలు సవాళ్లను ఎదుర్కొన్నాడు. చెన్నైకి చెందిన వందనను ప్రేమించి మొదట రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. మూడు నెలలు కలిసి జీవించిన అనంతరం వందనపై ఆరోపణలు రావడంతో వివాదం మొదలైంది. సుదీర్ఘ న్యాయపోరాటం అనంతరం తీర్పు వందనకు అనుకూలంగా రావడంతో, ఇరుకుటుంబాలు రాజీపడ్డాయి. ఈ ఇద్దరూ 2008లో మళ్లీ వివాహం చేసుకుని కలసి జీవితం కొనసాగిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం శ్రీరామ్ కుటుంబం తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉంది. డ్రగ్స్ వాడకం వలన అతని వ్యక్తిగత, వృత్తిపర జీవితాలపై తీవ్ర ప్రభావం చూపింది.