వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన విభిన్న కథాచిత్రం ‘శ్రీ చిదంబరం గారు’. వినయ్ రత్నం దర్శకుడు. చింతా వినీషరెడ్డి, చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మాతలు. వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. శుక్రవారం(నేడు) సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. విఖ్యాత సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, హీరో ఆనంద్ దేవరకొండ, నటి, నిర్మాత నిహారిక కొణిదెల ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.
ఎక్కడా రాజీపడకుండా సినిమాను నిర్మించాననీ, ఈ సినిమాతో కొత్తవాళ్లు వెలుగులోకి వస్తే సంతోషమని, తప్పకుండా ఈ యంగ్టీమ్ని ఆడియన్స్ ఆదరిస్తారని నమ్మకం ఉందని నిర్మాత చింతా గోపాలకృష్ణారెడ్డి ఆశాభావం వెలిబుచ్చారు. హీరో వంశీ ఇందులో మెల్లకన్ను ఉండే యువకుడు చిదంబరంగా నటించాడని, సంధ్య వశిష్ట చేసిన లీల పాత్ర చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందని, ఈ సినిమాలోని ప్రతి పాత్రా సహజంగా ఉంటుందని దర్శకుడు వినయ్ రత్నం తెలిపారు. ఇంకా వంశీ నందిపాటి, కథానాయకుడు వంశీ తుమ్మల కూడా మా ట్లాడారు.