వేములవాడ, ఆగస్టు 4: వేములవాడ రాజన్న భక్తులకు మరింత ఆహ్లాదం పంచేందుకు నిర్మించిన బండ్పార్ అలంకారప్రాయమే అయింది. నిర్వహణపై శాఖల మధ్య సందిగ్ధత నెలకొనడంతో ప్రారంభించి ఏడు రోజులైనా తాళం వేసే ఉంటున్నది. దీంతో సందర్శకులకు నిరాశే మిగులుతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రాజరాజేశ్వర స్వామి గుడి చెరువుపై రూ.12 కోట్లతో బండ్పార్కు ప్రతిపాదనలు చేసి, పనులు కూడా ప్రారంభించారు. మిగిలిన కొద్దిపాటి పనులను కలెక్టర్ గరిమా అగ్రవాల్ పూర్తి చేయించారు.
పారుకు మరింత ఆధ్యాత్మికతను జోడిస్తూ నాలుగు అడుగుల శివుడి విగ్రహం, సప్తమాత్రికలను ఏర్పాటు చేశారు. పనులు మొత్తం పూర్తి కావడంతో గత నెల 30న మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. కానీ, పార్కు నిర్వహణను ఎవరు చూడాలనేది అధికారులు ఇంకా తేల్చకపోవడంతో తాళం వేసే ఉంటున్నది. 700 మీటర్ల పొడవున్న బండ్ పారులో పనిచేయడానికి కనీసం పదిహేను మంది వరకు అవసరం.
సందర్శకులెవరూ పారు ఆస్తులు ధ్వంసం చేయకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సి ఉంటుంది. పకనే గుడి చెరువు కూడా ఉన్నందున భద్రత అవసరమని, దీని నిర్వహణను ఎవరు చేయాలనేది తేల్చాలి. బండ్ పార్లో భారీ శివుడి విగ్రహంతోపాటు ఏర్పాటు చేసిన గ్రీనరీపై వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ కావడం, పార్కును ప్రారంభించిన విషయం తెలిసి పెద్ద సంఖ్యలో వస్తున్న సందర్శకులకు నిరాశే మిగులుతున్నది.