Sreelila | సినీరంగంలో కొందరు హీరోయిన్లకు సక్సెస్ రావడానికి చాలా సమయం పడుతుంది. అదే కొంత మందికి మాత్రం మొదటి సినిమాతోనే మంచి విజయంతో పాటు క్రేజ్‌ను దక్కించుకుంటారు. ఈ క్రమంలోనే మొదటి సినిమాతోనే మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది శ్రీలీల. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో రోషన్ కుమార్ హీరోగా శ్రీలీల హీరోయిన్గా నటించిన చిత్రం పెళ్లి సందD. గత ఏడాది దసరా కానుకగా విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికి బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు సాధించింది. ముఖ్యంగా ఈ సినిమాలో శ్రీలీల తనదైన నటన, అందంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈమె తన రెమ్యునరేషన్‌ను భారిగా పెంచిందట.
“OTT | 100 రోజులు దాటినా పెళ్లి సందD ఇంకా ఓటీటీలో ఎందుకు రాలేదు..?”
“sree leela: పెళ్లి సందడి బ్యూటీ వెనక పడుతున్న టాలీవుడ్ హీరోలు”
శ్రీలీల పెళ్లి సందD చిత్రానికి 5లక్షల పారితోషాకాన్ని తీసుకుందట. ఈ సినిమాతో వచ్చిన క్రేజ్‌తో ఇప్పుడు ఏకంగా 50లక్షల వరకు రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేస్తుందని సమాచారం.ప్రస్తుతం ఈమె మాస్రాజ రవితేజ ధమాకా, నవీన్‌పోలిశెట్టి అనగనగా ఒకరాజ చిత్రాలలో హీరోయిన్గా నటిస్తుంది. వీటితో పాటుగా రౌడిబాయ్స్ ఫేం ఆశిశ్రెడ్డి సెల్ఫిష్ లోనూ ఎంపికైనట్లు సమాచారం. ఏదేమైనా అంత భారిగా రెమ్యునరేషన్ పెంచడంపై నెటీజన్లు ఇది మరీ టూ మచ్ అంటూ కామెంట్స్ వేస్తున్నారు.
“debut Heroines 2021 | తెలుగు ఇండస్ట్రీపై మెరిసిన కొత్త తారలు వీళ్లే..”
Allu Arjun stylist | అల్లు అర్జున్ ఇండియాలోనే పెద్ద స్టార్ అవుతాడు: హర్మన్ కౌర్