Sreeleela | అందం, అభినయం, డ్యాన్స్ లో కోస్టార్లకు గట్టిపోటీనిచ్చే అతికొద్ది భామల్లో టాప్‌లో ఉంటుంది శ్రీలీల. గ్లామరస్ పాత్రలతోపాటు నటనకు ఆస్కామున్న రోల్స్ చేస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తుంది. ఈ భామకు సంబంధించి క్రేజీ అప్డేట్ ఒకటి ఇప్పుడు నెట్టింట రౌండప్ చేస్తోంది. శ్రీలీల ఓ క్రేజీ కమర్షియల్‌లో ఛాన్స్ కొట్టేసిందన్న వార్త అభిమానులు, ఫాలోవర్లలో జోష్ నింపుతోంది.
తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ ఏం ప్లాన్ చేసినా గ్రాండ్‌గా ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.. మెర్సల్, బిగిల్, జవాన్ చిత్రాలే దీనికి ఉదాహరణ. ఈ స్టార్ డైరెక్టర్ ఈ సారి మాత్రం ఎవరూ ఊహించన విధంగా అందరినీ ఆశ్చర్యపరిచేలా ఓ యాడ్ ఫిల్మ్ చేస్తున్నాడన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్లో హాట్ టాపిక్‌గా మారింది. అట్లీ ఇండియాలోనే ఇదివరకెన్నడూ చేయడని అత్యంత ఖరీదైన యాడ్ ఫిల్మ్ ను డైరెక్ట్ చేశాడట.
ఇంతకీ ఏంటా యాడ్ అనుకుంటున్నారా..? చింగ్స్ దేశీ చైనీస్ బ్రాండ్ టీవీ కమర్షియల్ యాడ్‌ను తీశాడని బీటౌన్ సర్కిల్లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. బాలీవుడ్ స్టార్లు రన్వీర్ సింగ్, బాబీ డియోల్‌తోపాటు సౌతిండియా సెన్సేషన్ శ్రీలీల కూడా ఈ భారీ యాడ్‌లో నటించడం విశేషం. త్వరలో ప్రసారం కానున్న ఈ యాడ్ కోసం అట్లీ టీం ఏకంగా రూ.150 కోట్లు ఖర్చు పెట్టిందని సమాచారం.
ఇదివరకెన్నడూ లేని విధంగా స్టన్నింగ్ సెట్స్, ప్రపంచ స్థాయి వీఎఫ్ఎక్స్, మల్టీపుల్ లొకేషన్లలో చింగ్స్ దేశీ చైనీస్ యాడ్ క్యాంపెయిన్ సినిమాటిక్ స్టైల్లో చేసేందుకు రెడీ అవుతున్నాడని బీటౌన్ సర్కిల్లో ఓ వార్త వైరల్ అవుతోంది. షారుక్‌ఖాన్‌తో తెరకెక్కించిన జవాన్ తర్వాత అట్లీ చేస్తున్న తొలి కమర్షియల్ ప్రాజెక్ట్ ఇదే కావడంతో అంచనాలు పెరిగిపోతున్నాయి.
Read Also :
Rahul Sankrityan | వీడి14లో విజయ్ దేవరకొండ విశ్వరూపం చూస్తారు : రాహుల్ సంకృత్యాన్
Khalifa Glimpse | పృథ్వీరాజ్ సుకుమారన్ బర్త్‌డే స్పెషల్.. ‘ఖలీఫా’ గ్లింప్స్ విడుదల
Nagarjuna | నాగార్జున 100వ సినిమాపై క్రేజీ అప్డేట్.. టబు స్థానంలో లేడి సూపర్ స్టార్?