Swag | కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో వినోదాన్ని అందించే యాక్టర్లలో ముందుంటాడు శ్రీ విష్ణు (Sree Vishnu). ఈ టాలెంటెడ్ యాక్టర్ నటిస్తోన్న తాజా చిత్రం స్వాగ్ (SWAG). హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పెళ్లి చూపులు ఫేం రీతూ వర్మ హీరోయిన్గా నటిస్తుండగా.. దక్షా నగార్కర్ మరో కీ రోల్ చేస్తోంది. స్వాగ్‌లో రీతూవర్మ వింజామర వంశపు రాణి రుక్మిణి దేవిగా నటిస్తుండగా.. రాజసం ఉట్టిపడే రాయల్ లుక్‌లో అలరిస్తోంది.
ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం స్వాగ్ విడుదల తేదీని ప్రకటించారు శ్రీవిష్ణు, రీతూ వర్మ. ఈ మూవీని అక్టోబర్ 4న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు తెలియజేశారు. ఆడ Ladies Vs మగ Gents.. అందరూ అక్టోబర్ 4న థియేటర్లకు వచ్చేయండి.. అంటూ షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
చారిత్రక నేపథ్యం ఉన్న శ్వాగణిక వంశం కథ నేపథ్యంలో కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీకి వివేక్ సాగర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
మేకర్స్ ఇప్పటికే స్వాగ్‌లో స్వాగ్ ప్రపంచానికి మరింత రాజసం.. అంటూ దక్షా నగార్కర్ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. దీంతోపాటు బాబా సెహెగల్ పాడిన సింగరో సింగ సాంగ్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది.
It’s ఆడ Ladies vs మగ Gents 😝
అందరు OCTOBER 4th Theatres ki వచ్చేయండి, Let’s get SWAGIFIED!! 💥😎#SWAGFromOct4th 💥@sreevishnuoffl @riturv #MeeraJasmine @DakshaOfficial #SharanyaPradeep @vishwaprasadtg @hasithgoli #VivekSagar @peoplemediafcy @vivekkuchibotla #KrithiPrasad… pic.twitter.com/4E1HYCUYi4
— BA Raju’s Team (@baraju_SuperHit) September 3, 2024
Nani 32 | నాని 32 అనౌన్స్మెంట్ డేట్ ఫైనల్.. ఇంతకీ ఏ సినిమానో మరి..?
Committee Kurrollu | కమిటీ కుర్రోళ్లు ఓటీటీ, టీవీలో సందడి చేసే టైం ఫిక్స్..!