Swag | కథను నమ్మి సినిమాలు చేసే యాక్టర్లలో టాప్‌లో ఉంటాడు శ్రీ విష్ణు (Sree Vishnu). ఈ ఏడాది ఓ భీమ్ బుష్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ టాలెంటెడ్ యాక్టర్ ఇప్పుడు స్వాగ్ (SWAG) సినిమాతో వినోదాన్ని పంచేందుకు రెడీ అవుతున్నాడు.
హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పెళ్లి చూపులు ఫేం రీతూ వర్మ హీరోయిన్గా నటిస్తోంది. వింజామర వంశపు రాణి రుక్మిణి దేవిగా నటిస్తోంది రీతూవర్మ . ఇప్పటికే లాంచ్ చేసిన ఫస్ట్ లుక్‌లో రాజసం ఉట్టిపడే రాయల్ లుక్‌లో కనిపిస్తూ సందడి చేస్తోంది. తాజాగా విడుదల తేదీని రేపు సాయంత్రం 5:35 గంటలకు ప్రకటించబోతున్నట్టు తెలియజేస్తూ వీడియోను అందరితో షేర్ చేసుకున్నాడు శ్రీవిష్ణు.
స్వాగ్‌లో దక్షా నగార్కర్ మరో కీలక పాత్రలో నటిస్తోంది. స్వాగ్ ప్రపంచానికి మరింత రాజసం.. అంటూ మేకర్స్ షేర్ చేసిన దక్షా నగార్కర్ లుక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ నుంచి లాంచ్ చేసిన పాపులర్ సింగ్ బాబా సెహెగల్ పాడిన సింగరో సింగ సాంగ్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా.. వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చారిత్రక నేపథ్యం ఉన్న శ్వాగణిక వంశం కథ నేపథ్యంలో కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Hello Hello.. ATTENTION!! 😎
Hey TFI Banisa, Re-Release Batch, Cinephiles, and Telugu Audience Failed Here Batch! 😜😉
It’s Time to get SWAGIFIED!! 🤩#SWAG Release Date will be announced TOMORROW @ 5:35 PM! 🤘🏻@sreevishnuoffl pic.twitter.com/haKB2kbg4g
— BA Raju’s Team (@baraju_SuperHit) September 2, 2024
Prasanth Varma | హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సస్పెన్స్.. ఇంతకీ ఆ ఛాలెంజ్ ఏంటో ..?
Venkat Prabhu | ది గోట్ సినిమాకు తలైవా, ధనుష్ ఫస్ట్ చాయిస్ అట.. వెంకట్ ప్రభు ఏమన్నాడంటే..?
Devara | తారక్ దేవరకు అదిరిపోయే ఓపెనింగ్.. సెన్సేషనల్ ప్రీ సేల్స్ ఎక్కడో తెలుసా..?
Viswam | స్టైలిష్ లుక్‌లో గోపీచంద్.. విశ్వం టీజర్ రిలీజ్ టైం ఫిక్స్
సింగరోసింగ ప్రోమో..