Mahesh babu Birthday | మహేశ్ బాబు బర్త్ డేకు సూపర్ సర్ప్రైజ్
Mahesh babu Birthday | మహేశ్ పుట్టినరోజుకు మరో 10 రోజులు మాత్రమే టైముంది. దీంతో అభిమానులు ఇప్పటి నుంచే సందడి మొదలు పెట్టారు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్ డే మహేశ్ బాబు అనే హ్యాష్‌ట్యాగ్ కూడా ట్రెండ్ చేస్తున్నారు.

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ( Mahesh babu ) కు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో నెంబర్ వన్ పీఠం కోసం పోటీపడుతున్న హీరోల్లో ఈయన కూడా ఉన్నాడు. పైగా గత కొన్నేళ్లుగా మహేశ్ బాబు వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. ఈయన గత సినిమాలు సరిలేరు నీకెవ్వరు, మహర్షి, భరత్ అనే నేను రూ.100 కోట్లకు అటు ఇటుగా వసూలు చేశాయి. దీంతో అభిమానులు కూడా మహేశ్ బాబు సినిమాపై అంచనాలు భారీగానే పెట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈయన పుట్టినరోజుకు మరో 10 రోజులు మాత్రమే టైముంది. దీంతో అభిమానులు ఇప్పటి నుంచే సందడి మొదలు పెట్టారు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్ డే మహేశ్ బాబు అనే హ్యాష్‌ట్యాగ్ కూడా ట్రెండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ బర్త్ డేకు మరో సర్ప్రైజ్ కూడా రాబోతోంది.
ఆగస్టు 9న మహేశ్ బాబు ( Mahesh babu ) 47వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుతం నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా నుంచి ఒక పాట విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ప్రకటన రాకపోయినా.. సంగీత దర్శకుడు తమన్ మాత్రం దీనిపై సోషల్ మీడియాలో హింట్స్ ఇస్తున్నారు. తాజాగా కీర్తి సురేశ్‌తో దిగిన ఫొటోను ట్విటర్లో పోస్టు చేశారు. అలాగే సర్కారు వారి పాట పనులు మొదలు పెట్టాం. ఆగస్టు తొందరగా వచ్చేయ్.. గెట్ రెడీ ఫర్ ఫోక్స్ అంటూ ట్వీట్ చేశారు. దీంతో మహేశ్ బర్త్ డే రోజు ఒక పాటను విడుదల చేసే అవకాశం ఉందని ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. మహేశ్ గత పుట్టిన రోజుకు మోషన్ పోస్టర్ విడుదల చేశాడు దర్శకుడు పరుశురామ్.
And Here We Start Our Works for #SarkaruVaariPaata 🎵❤️🦁🎧 @KeerthyOfficial #Augusttttttt !!! Come VeryVery sooooooonNnNnN 💨
— thaman S (@MusicThaman) July 28, 2021
Get ready folks !! 🪧📢 pic.twitter.com/IgNzU3Ch1g
కరోనా వైరస్ లేకపోయి ఉంటే ఈపాటికి సర్కారు వారి పాట సినిమా వచ్చేది. కానీ వైరస్ కారణంగా ఇప్పటికీ షూటింగ్ దశలోనే ఉంది. అయినా సరే బర్త్ డే కానుకగా సర్కారు వారి పాట సినిమా నుంచి టైటిల్ సాంగ్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న తమన్.. మహేశ్ సినిమాకు కూడా అదిరిపోయే ట్యూన్స్ ఇస్తున్నాడు. మోషన్ పోస్టర్లో వచ్చిన సర్కారు వారి పాట మ్యూజిక్ అదిరిపోయింది. ఇక ఫుల్ సాంగ్ అంతకంటే జోష్‌లో ఉంటుందని నమ్మకంగా చెబుతున్నాడు తమన్. దాంతో పాటు అదేరోజు త్రివిక్రమ్ సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా వస్తుందని తెలుస్తోంది. అందుకే ఆగస్టు 9 కోసం మహేష్ బాబు అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
సిల్క్ స్మితను కొట్టే ఆడది లేదు.. శ్రీదేవి కూడా ఆమెనే ఫాలో అయ్యేది.. బాలయ్య సంచలన వ్యాఖ్యలు
మళ్లీ ఎమోషనల్ అయిన ఆర్.నారాయణమూర్తి..
దానికే మా ఓటు.. రూటు మారుస్తున్న అందాల భామలు
రెండో పెళ్లికి సిద్ధమైన అక్కినేని మనుమడు.. నెట్టింట పెళ్లి కార్డు వైరల్
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మూడు రోజుల్లో బిగ్ అప్డేట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Kubheer | భూముల రీసర్వే పనులు పారదర్శకంగా నిర్వహించాలి : సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్
Green Crackers: ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవచ్చు: సుప్రీంకోర్టు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం తథ్యం : రేగా కాంతారావు
Maulana Shahabuddin Razvi: షరియత్ ప్రకారం సీఎం ఒమర్ పెళ్లి చల్లదు: జమాత్ చీఫ్
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

