ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం తథ్యం : రేగా కాంతారావు
గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి విజయం విజయం తథ్యం అని బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే లేగా కాంతారావు అన్నారు. అన్నివర్గాల ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో, సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పాలన...
బూర్గంపహాడ్, నవంబర్ 02 : గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి విజయం విజయం తథ్యం అని బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే లేగా కాంతారావు అన్నారు. అన్నివర్గాల ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో, సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పాలన ఘోరంగా విఫలమైందన్నారు. సోమవారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని మోరంపల్లిబంజర్ శ్రీ వేంకటేశ్వర ఫంక్షన్హాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియలో భాగంగా పార్టీ ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన మండల స్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గ ఇన్చార్జి దిండిగాల రాజేందర్ కలిసి రేగా మాట్లాడారు. అమలుకు సాధ్యం కాని హామీలను ఇచ్చి, ప్రజలకు బూటకపు మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయకుండా ఘోరంగా విఫలం చెందిందన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం తథ్యం : రేగా కాంతారావు
త్వరలో జరగనున్న ఖమ్మం- వరంగల్- నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఓటరు నమోదును బీఆర్ఎస్ శ్రేణులు ముమ్మరంగా చేపట్టి ప్రతి ఒక్క పట్టభద్రుడు ఓటు నమోదు చేసుకునేలా చూడాలన్నారు. బీఆర్ఎస్ పార్టీని నమ్ముకుని పని చేస్తున్న కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని తెలిపారు. మరో ఏడాది ఓపిక పడితే కార్యకర్తల కష్టాలు తీరుతాయని పేర్కొన్నారు. మండలవ్యాప్తంగా అర్హులైన పట్టభద్రులను గుర్తించి ఓటరునమోదు చేసుకునేలా సహాయ, సహకారాలు అందించాలని, బీఆర్ఎస్ శ్రేణులు సమన్వయంతో పనిచేసి ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించేలా కృషి చేయాలన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తారని రేగా ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మాజీ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, సొసైటీ మండల అధ్యక్షుడు బిక్కసాని శ్రీనివాసరావు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, ప్రజా ప్రతినిధులు, మండల నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, మహిళా నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం తథ్యం : రేగా కాంతారావు
Maulana Shahabuddin Razvi: షరియత్ ప్రకారం సీఎం ఒమర్ పెళ్లి చల్లదు: జమాత్ చీఫ్
AP News | వైసీపీలో తీవ్ర మనోవేదన అనుభవించా.. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
అఖిలపక్షం ఆధ్వర్యంలో గుర్రంపోడులో రాస్తారోకో
Vidadala Rajini | ఏపీలో దాడులు, దౌర్జాన్యాలతో జంగిల్ రాజ్ పాలన : మాజీ మంత్రి విడుదల రజిని
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

