Kubheer | భూముల రీసర్వే పనులు పారదర్శకంగా నిర్వహించాలి : సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్
Kubheer | నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని సౌన గ్రామంలో కొనసాగుతున్న భూముల రీసర్వే ను భైంసా సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
కుభీర్ : నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని సౌన గ్రామంలో కొనసాగుతున్న భూముల రీసర్వే (Land Resurvey) ను భైంసా సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్ ( Ajmeera Sanketh Kumar ) సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతున్న భూముల రీసర్వే ప్రక్రియ, పనుల పురోగతి, సంబంధిత వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రీసర్వే పనులు పారదర్శకంగా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలని సూచించారు. భూములకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. అనంతరం సబ్ కలెక్టర్ గ్రామంలోని స్థానిక శివాలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కెంశెట్టి నందాబాయి ఆధ్వర్యంలో గ్రామస్తులు సబ్ కలెక్టర్‌ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కుభీర్ తహసీల్దార్ శ్రీదేవి, గ్రామ సర్పంచ్ కెం.శెట్టి నందాబాయి, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kubheer | భూముల రీసర్వే పనులు పారదర్శకంగా నిర్వహించాలి : సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్
Green Crackers: ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవచ్చు: సుప్రీంకోర్టు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం తథ్యం : రేగా కాంతారావు
Maulana Shahabuddin Razvi: షరియత్ ప్రకారం సీఎం ఒమర్ పెళ్లి చల్లదు: జమాత్ చీఫ్
AP News | వైసీపీలో తీవ్ర మనోవేదన అనుభవించా.. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

